వైఎస్ జగన్మోహన్ రెడ్డి… మీడియాకు.. కులం అంటగట్టి… చాలా రచ్చ చేశారు కానీ… ఆయన నిందించిన మీడియాలో జగన్ మీడియా లేదు. అందుకే గతంలో.. జనసేన పార్టీ కార్యక్రమాలకు కొంత కవరేజీ వచ్చేది. ముఖ్యంగా… నాలుగో ఆవిర్భావ దినోత్సవంలో ఎప్పుడైతే.. చంద్రబాబు, లోకేష్‌పై విమర్శలు, ఆరోపణలు ప్రారంభించారో.. అప్పటి నుంచి సాక్షి పత్రికకు పవన్ కల్యాణ్.. వాంటెడ్ అయిపోయారు. మిగతా వాటి సంగతేమో కానీ… చంద్రబాబును విమర్శించిన వాటిని మాత్రం … పవన్ కల్యాణ్ పేరుతో వీలైనంతగా ప్రచారం చేయడానికి జగన్ మీడయా ప్రయత్నిస్తోంది. ఈ ఒక్క అంశంలో తప్ప… పవన్ కల్యాణ్ కు కానీ.. ఆయన పార్టీకి సంబంధించిన కార్యక్రమాలకు కానీ.. జగన్ మీడియా అసలు కవరేజీనే ఇవ్వడం లేదు. అది ఎంత ముఖ్యమైనా సరే.. ఒక్క రెండు లైన్ల సమాచారం ఇవ్వడానికి కూడా సిద్ధపడటం లేదు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని.. సన్నద్ధంగా లేమని… పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తామని.. పవన్ కల్యాణ్.. ఓ ప్రెస్‌నోట్ రిలీజ్ చేశారు. ఓ రకంగా ఇది ప్రాధాన్యత కలిగిన వార్తే. ఓ పార్టీ ఎన్నికల బరి నుంచి తప్పుకోవడం అంటే… అది ప్రజలందరికీ తెలియాల్సిన విషయమే. ముఖ్యంగా… తెలంగాణలో మంచి ఫ్యాన్ బేస్ ఉన్న పవన్ కల్యాణ్ పార్టీకి సంబంధించినది కాబట్టి… అన్ని పత్రికలూ కవర్ చేశాయి. కానీ సాక్షి పత్రిక మాత్రం… పూర్తిగా మర్చిపోయింది. పవన్ కల్యాణ్ జనసేన అసలు పార్టీయే కాదన్నట్లుగా.. వారి ప్రకటన అసలు పట్టించుకోవాల్సిన అవసరమే లేదన్నట్లుగా వదిలేశారు. ప్రధాన మీడియాలో పవన్ కల్యాణ్ నిర్ణయంపై ఎవరూ విశ్లేషణలు ఇవ్వలేదు కానీ… కనీసం వార్త అయినా … సాక్షి అది కూడా చేయలేదు.
కొద్ది రోజుల కిందట… వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఇంచుమించు.. జనసేన పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయమే తీసుకుంది. బలంగా లేమని.. మరింత బలపడి.. 2024 ఎన్నికలలో పోటీ చేస్తామని ప్రకటించుకుంది. 2018లో అసెంబ్లీ ఎన్నికలు జరిగితే.. మళ్లీ 2023లోనే వస్తాయి కానీ… 2024లో ఎలా వస్తాయని.. చాలా మంది… విమర్శలు చేసినా.. వైసీపీ దాన్నే.. తన సాక్షి పత్రికలో 2014కే ఫిక్సయిపోయి ఘనంగా అచ్చేసుకుంది. అలాంటి నిర్ణయమే… జనసేన తీసుకుంటే.. అసలు వార్త కానట్లుగా వ్యవహరించింది. మొత్తానికి.. జగన్ మీడియా… జగన్ కోసమే.. తప్ప… ప్రజల కోసం కాదని.. పదే పదే నిరూపిస్తోంది. కనీసం.. తనకు ఎలాంటి రిజర్వేషన్లు పెట్టుకోవాల్సిన అవసరం లేదని.. తెలంగాణలోనూ… ప్రొఫెషనలిజం చూపించలేకపోతోంది.