కక్ష సాధింపులు అనుకుంటారన్న మోహమాటంతో నేరస్తుల్ని ఏపీ ప్రభుత్వం ఎలా వదిలి వేస్తుందో చెప్పే ఘటన ఇది. స్వయంగా ఏపీ హైకోర్టే కనీసం ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా వేయని ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయుల్ని ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించింది. హీరోయిన్ జత్వానీని వేధించిన కేసులో.. కేసులు నమోదు కావడంతో ఇతర ఐపీఎస్లు, పోలీసులు ముందస్తు బెయిల్ కోసంకోర్టుకెళ్లారు. విచారణ పూర్తయ్యే వరకూ వారిని అరెస్టు చేయవద్దని కోర్టు చెప్పింది. ఈ విచారణ జరుగుతోంది. తాజాగా విచారణలో హైకోర్టు.. ఈ కేసులో ఏ 2గా ఉన్న ఐపీఎస్ అధికారి సీతారామాంజనేయుల్ని ఎందుకు అరెస్టు చేయలేదని .. ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ వేయలేదు కదా అని ప్రశ్నించింది.
ఈ ప్రశ్నకు ప్రభుత్వ న్యాయవాది వద్ద.. ఏపీసీఐడీ వత్త సమాధానం లేదు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ నేతల పట్ల అత్యంత ఘోరంగా వ్యవహరించిన ఐఫీసర్ పీఎస్ఆర్ ఆంజనేయులు. ఆయన వల్ల కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య చేసుకున్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి తన వ్యాపారాలను కోల్పోయాడు. చంద్రబాబు అరెస్టు వెనుక మాస్టర్ర మైండ్ ఆయనే. చంద్రబాబును జైలుకు పంపడానికి వ్యవస్థలతో కూడా ఓ ఆటాడుకున్నారని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. బ్రాహ్మణి, భువనేశ్వరి వ్యక్తిగత సమాచారాన్ని తప్పుడు పద్దతుల్లో సేకరించి బ్లాక్ మెయిల్ చేశారు. వారిని కూడా అరెస్టు చేస్తామని హెచ్చరించారు.
ఇన్ని ఘోరాలకు పాల్పడిన సీతారామంజనేయల్ని చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఆయనపై కేసులు పెట్టినా.. ముందస్తు బెయిల్ కోసం కూడా ప్రయత్నించని ఆయనను అరెస్టు చేసేందుకు ప్రయత్నించలేదు. ఇదే అంశాన్ని హైకోర్టు ప్రస్నించింది. ఇప్పటికే జత్వానీ కేసులో కుక్కల విద్యాసాగ్ర అరెస్టవడమే కాదు.. బెయిల్ కూడా తెచ్చుకున్నారు.