కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి రాజీనామా మాత్రమే ప్రస్తుతం రాష్ట్రంలోని రాజకీయ సంక్షోభం నుండి బయటపడి తమ ప్రభుత్వాన్ని కాపాడేలా చేస్తుందని భావించిన కాంగ్రెస్ జెడిఎస్ వర్గాలకు కుమారస్వామి షాక్ ఇచ్చారు. నేనెందుకు రాజీనామా చేయాలంటూ కుమారస్వామి అడ్డం తిరగడంతో మరొకసారి కర్ణాటక రాజకీయ నాటకం రసకందాయంలో పడింది.
click here: https://www.telugu360.com/te/kumaraswamy-likely-to-resign/
రెబెల్ ఎమ్మెల్యేల లో కొందరు కాంగ్రెస్ నేత మరియు మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ని తిరిగి ముఖ్యమంత్రిగా ప్రతిష్టిస్తే తాము తమ రాజీనామాలను వెనక్కి తీసుకుంటామని చెప్పిన కారణంగా కుమారస్వామిని కాంగ్రెస్ నేతలు ఒప్పించి రాజీనామా చేయిస్తారని ముందు వార్తలు వచ్చాయి. మీడియా చానల్స్ లో సైతం కుమారస్వామి రాజీనామా చేయడమే తరువాయి అంటూ కథనాలు వచ్చాయి. అయితే కుమారస్వామి మాత్రం, తాను రాజీనామా చేసేది లేదని తెగేసి చెబుతున్నారు. గతం లో ఇలాగే తన పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసినప్పుడు అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న బిజెపి నేత ఎడ్యూరప్ప రాజీనామా చేయలేదని పదేళ్ళ కిందటి సంగతులు గుర్తు చేస్తున్నారు. కాబట్టి తాను మాత్రం ఎందుకు రాజీనామా చేయాలని ఆయన ప్రశ్నిస్తున్నారు.
కుమారస్వామి రాజీనామా చేయను అని అడ్డం తిరగడంతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. ఈ సంక్షోభం ఏ మలుపు తిరుగుతుందో అన్నది ఆసక్తికరంగా మారింది.