ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ నేతల్లో వైసీపీ జీన్స్ కనిపించే ఒకే ఒక్క నేత ఎమ్మెల్సీ సోము వీర్రాజు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు.. చంద్రబాబును ఎంత తీవ్రంగా వ్యక్తిగత శతృవుగా పరిగణిస్తారో.. సోము వీర్రాజు కూడా అంతే. ఈ శతృత్వం చంద్రబాబును వ్యక్తిగతంగా.. అదీ కూడా ప్రాణాలకు ముడిపెట్టి మరీ హెచ్చరికలు జారీ చేసే వరకూ వెళ్తోంది. జగన్మోహన్ రెడ్డి…”చంద్రబాబును నడిరోడ్డుపై నిలబెట్టి కాల్చేసిన తప్పు లేదు” అంటారు. సోము వీర్రాజు కూడా అంతే… “2019లో అలిపిరి రిపీట్ అవుద్ది.. రెడీగా ఉండండని” బెదిరిస్తారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. “చంద్రబాబును ఏదైనా నీళ్లు లేని బావిని చూసుని దూకండి” అని శాపనార్థాలు పెడతారు. సోము వీర్రాజు… ఇంకో అడుగు ముందుకేసి..దీన్ని ఇంకో రకంగా..” పంచభూతాలు పగబడతాయి…జాగ్రత్తగా ఉండాలని..” నేరుగా వార్నింగ్ ఇస్తారు. ఈ పరంపర ఇలా సాగుతూనే ఉంది.
వైసీపీ, బీజేపీ నేతల తీరుపై… టీడీపీ నేతల్లో విస్మయం వ్యక్తమవుతోంది. రాజకీయంగా ఎన్నైనా విమర్శలు చేసుకోవచ్చు కానీ.. ఇలా చంద్రబాబు ప్రాణాలతో ముడిపెట్టి మరీ హెచ్చరికలు జారీ చేసేంతగా .. అసహనానికి గురి కావడమేమిటనేది.. టీడీపీ నేతలను ఆలోచింపచేస్తున్న విషయం. సహజంగా సోము వీర్రాజు.. తెలుగుదేశం పార్టీని విపరీతంగా ద్వేషిస్తారు. ఆయనే కాదు.. చాలా మంది ద్వేషిస్తారు. కానీ వావెవరూ చంద్రబాబుకు హాని జరగాలని కానీ… జరుగుతుంది మీరే చూస్తారని కానీ వ్యాఖ్యలు చేయరు. వైసీపీలో జగన్… బీజేపీ సోము వీర్రాజు మాత్రమే.. ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారు. “కరుడుగట్టిన తీవ్రవాది” అనే పదాన్ని కూడా చంద్రబాబుకు అన్వయించారంటో.. సోము వీర్రాజులో చంద్రబాబుపై ఎంత కసి ఉందో అర్థం చేసుకోవచ్చని టీడీపీ నేతలు విశ్లేషిస్తున్నారు.
ప్రెస్‌మీట్ పెట్టిన ప్రతీసారి సోము వీర్రాజు అజెండా..అయితే.. ఆరోపణలు..లేకపోతే హెచ్చరికలు అన్నట్లు ఉంటోంది. విశేషం ఏమిటంటే… ఆయన ఇప్పుడు గవర్నర్‌ను కూడా వదలడం లేదు. గవర్నర్ జోక్యం చేసుకుని ఉన్న పళంగా చంద్రబాబు సర్కార్‌ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఆ పని చేయకుండా.. గవర్నర్ ఆలయాల చుట్టూ తిరుగుతున్నారని మండి పడుతున్నారు. మొత్తానికి సోము వీర్రాజు.. వ్యవహారం మాత్రం.. బీజేపీలోనే కాదు..ఏపీలో హాట్ టాపిక్‌గా మారుతోంది.