డి.సురేష్ బాబు.. ఓ విధంగా నిర్మాతల్లో బడా మేధావి. ఎప్పుడు ఏ సినిమా తీయాలో బాగా తెలుసు. తన సినిమాని ఎలా ప్రమోట్ చేసుకోవాలో ఇంకా బాగా తెలుసు. చిన్న సినిమాని పెద్ద సినిమా చేసే తెలివితేటలు ఆయన సొంతం. సురేష్‌బాబు ఓ ప్రాజెక్ట్ పట్టాడంటే.. సేఫ్‌గా అందులోంచి బయటపడిపోతాడు. పైగా ఎంత పెద్ద సినిమా తీయగలిగే స్టామినా అయినా ఉంది. అలాంటి సురేష్‌బాబు ఈమధ్య విచిత్రమైన స్టెప్పులు వేస్తున్నాడు. సోలోగా తాను సినిమా తీయకుండా ఇద్దరు ముగ్గురు పార్టనర్స్‌ని కలుపుకుంటున్నాడు. తాజాగా వెంకటేష్ – నాగచైతన్య సినిమాల పట్టాలెక్కబోతోంది. బాబి దర్శకుడు. దీనికి సురేష్‌బాబు నిర్మాత. కాకపోతే తనకు సపోర్ట్‌గా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, కోనఫిల్మ్ కార్పొరేషన్ సంస్థలు నిర్మించబోతున్నాయి.
వెంకటేష్, చైతూ ఇద్దరూ తన హీరోలే. పారితోషికం విషయంలో గోల చేయరు. పైగా బాబి భారీ పారితోషికం డిమాండ్ చేయడు. తెలివిగా మసులుకుంటే తక్కువలో తక్కువగా ఈసినిమా చేసేసి.. టేబుల్ ప్రాఫిట్ దక్కించుకోవొచ్చు. అలాంటి సందర్భంలోనూ.. ఈ సినిమాకి పార్టనర్స్‌ని వెదుక్కున్నాడంటే సురేష్‌బాబు లాజిక్ ఏమిటో అర్థం కాకవడం లేదు. బహుశా… తాను పైసా పెట్టకుండా హీరోల్ని మాత్రమే ఇచ్చి – ప్రొడక్షన్ ఖర్చంతా మిగిలిన వాళ్లకు వదిలేయాలని అనుకుంటున్నాడేమో. లేదంటే సినిమా పట్టాలెక్కకముందే ఈ కాంబినేషన్‌పై అనుమానాలు మొదలై ఉంటాయి. ఏదేమైనా సురేష్ ప్రొడక్షన్స్ లాంటి సంస్థ.. ఓ సినిమా చేయడానికి, అందునా తమ హీరోలతో సినిమా తీయడానికి పార్టనర్స్‌ని వెదుక్కోవడం టాలీవుడ్లో ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. దీని వెనుక ఉన్న లాజిక్ ఏంటో.. సురేష్ బాబుకే తెలియాలి.