తెలంగాణ బీజేపీ నేతలు ఆఫ్ లైన్‌కి వెళ్లిపోతున్నారు. ముఖ్యంగా ఇతర పార్టీల నుంచి వచ్చి చేరిన వారు.. అక్కడ ఉండటం దండగ అనుకుంటున్నారు. దీంతో పార్టీ కార్యక్రమాల్లోనూ పాల్గొనడం లేదు. మోదీ పాలనను ఇంటింటికి ప్రచారం చేయాలని గురువారం రోజు అంతా అన్ని స్థాయిల నేతలు తమ తమ నియోజకవర్గాల్లో కనీసం వంద ఇళ్లకు వెళ్లాలని నిర్దేశించింది. అయితే ఈటల రాజేందర్ , రాజగోపాల్ రెడ్డి సహా అనేక మంది అసలు ఈ కార్యక్రమం గురించి పట్టించుకోలేదు. దీంతో పార్టీలో సమస్య చిన్నది కాదని.. ఎప్పుడైనా బ్లాస్ట్ కావొచ్చన్న అభిప్రాయం పెరిగిపోతోంది.
ఈటల రాజేందర్ తో పాటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, యొన్నం శ్రీనివసరెడ్డి వంటి వారితో పాటు మరికొంత మంది అదే పని చేస్తున్నారు. ఇది తెలంగాణ బీజేపీ ప్రోగ్రాం కాదని.. కేంద్రానిదని అందరూ పాల్గొంటారని అనుకున్నారు . కానీ అలాంటిదేమీ లేదని తెలిసిపోయింది. ఈటల రాజేందర్ కొంత కాలగా బీజేపీ హైకమాండ్ పై అసంతృప్తిగా ఉన్నారు. హైకమాండ్ బండి సంజయ్ నే కొనసాగించాలని నిర్ణయించుకుంది.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. బీఆర్ఎస్ ను ఓడించే పార్టీ బీజేపీనేనని నమ్మి పార్టీలో చేరారు.కానీ ఇప్పుడు రెండు పార్టీల మధ్య ఏదో జరుగుతోందన్న భావనలో ఉన్నారు. అదే సమయంలో రాజగోపాల్ రెడ్డి సోదరుడు వెంకట్ రెడ్డి కాంగ్రెస్ లో నే ఉండనున్నారు. రాజగోపాల్ రెడ్డి మళ్లీ పార్టీ మారకపోతే ఆయన సోదరుడిపై కాంగ్రెస్ లో అనుమాన మేఘాలుంటాయి. అందుకే ఆయన కూడా పార్టీ మారాలనుకుంటున్నారని అంటన్నారు. మరో వైపు తెలంగాణ బీజేపీపై హైకమాండ్ దృష్టి సారించలేకపోతోంది. అగ్రనేతల పర్యటనలు రద్దు అవుతున్నాయి. అసంతృప్త వాదుల్ని బుజ్జగించలేకపోతున్నారు.