విజయ్.. ఇక‌ మారడా?

తమిళ హీరో విజయ్ కి తెలుగులో చెప్పుకోదగ్గ మార్కెట్ వుంది కానీ ఆయనకే తెలుగు మార్కెట్ పై పెద్ద శ్రద్ధ లేదు. ఆయన సినిమాలన్నీ తెలుగులో విడుదలౌతాయి. కానీ ఆయన మాత్రం ఇక్కడ కనీసం ఒక్క ప్రెస్ మీట్ కి కూడా హాజరవ్వరు. ఈవారం విజయ్ The GOAT (ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్) సినిమా తెలుగులో విడుదల కానుంది. వెంకట్ ప్రభు ఈ సినిమాకి దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని తెలుగు రిలీజ్ చేస్తున్నారు.

గతంలో ‘లియో’ రిలీజ్ సమయంలో లోకేష్ కనకరాజ్ కారణంగా మంచి బజ్ వచ్చింది. అలాగే ‘వారసుడు’ కి దిల్ రాజు ప్రొడక్షన్ కలిసొచ్చింది. కానీ ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ కి రావాల్సిన బజ్ రాలేదని చెప్పాలి. ఇలాంటి సమయంలో విజయ్ సమక్షంలో ప్రీరిలీజ్ ఈవెంట్ జరిగివుంటే ఎంతోకొంత ఊపు వచ్చేది. మైత్రీ మూవీస్ రిలీజ్ కి ముందుకి రావడంతో వారు విజయ్ ని ప్రీరిలీజ్ ఈవెంట్ కి తీసుకురాగలరేమో అనుకున్నారు. కానీ ఈసారీ విజయ్ హ్యాండ్ ఇచ్చారు. ఎలాంటి సందడి లేకుండానే ప్రీరిలీజ్ ఈవెంట్ జరిగిపోయింది. విజయ్ కి ఎందుకో మొదటి నుంచి తెలుగు మార్కెట్ మీద ఫోకస్ లేదు. ఈ సినిమా విషయంలో కూడా విజయ్ లో మార్పు రాలేదు. కాక‌పోతే.. మైత్రీ మూవీస్ మాత్రం `స‌క్సెస్ మీట్ కు త‌ప్ప‌కుండా తీసుకొస్తాం` అంటూ హ‌మీ ఇస్తున్నారు. ఓ వైపు క‌మ‌ల్ హాస‌న్‌, విక్ర‌మ్ లాంటి వాళ్లు ఊరూరా తిరుగుతూ త‌మ సినిమాల్ని ప్ర‌మోట్ చేసుకొంటుంటే, విజ‌య్ మాత్రం ఈ విష‌యంలో మీన‌మేషాలు లెక్కేస్తున్నాడు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మారుతికి ముందే తెలుసా?

రాజ్ తరుణ్ కి హ్యాట్రిక్ ఫ్లాపులు పడ్డాయి. రెండు నెలల వ్యవధిలో మూడు సినిమాలు రాజ్ నుంచి వచ్చాయి. పురుషోత్తముడు, తిరగబడరాస్వామి, భలే ఉన్నాడే. ఈ మూడు ఫ్లాపులే. భలే ఉన్నాడే చాలా...

బంగ్లాని లైట్ తీసుకోవద్దు బాసూ

ఇండియా - బంగ్లాదేశ్‌ టెస్ట్ సిరీస్ ఈనెల‌ 19 నుంచి ప్రారంభం కానుంది. డబ్ల్యూటీసీ 2023-25 సీజన్‌లో రాబోయే పది టెస్టులు టీమ్‌ఇండియాకు అత్యంత కీలకం. అందుకే ఈ సిరీస్ ప్రాధాన్యతని సంతరించుకుంది....

చిట్‌చాట్‌లతో BRSను చిరాకు పెడుతున్న రేవంత్ !

రేవంత్ రెడ్డి మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడే మాటలు మీడియాలో హైలెట్ అవుతూంటాయి. వాటిని పట్టుకుని బీఆర్ఎస్ ఆవేశ పడుతోంది . అంతా అయిపోయిన తరవాత తీరిగ్గా.. నేను ఎప్పుడన్నాను అని రేవంత్...

ఢిల్లీ తర్వాత సీఎం కూడా కేజ్రీవాలే ?

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మంగళవారం రాజీనామా చేయబోతున్నారు. అదే రోజు ఢిల్లీ శాసనసభాపక్ష సమావేశం కూడా నిర్వహిస్తున్నారు. కొత్త సీఎంగా కేజ్రీవాల్ ఎవరికి చాన్సిస్తారన్నది హాట్ టాపిక్ గా మారింది. విచిత్రంగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close