స్టాక్ మార్కెట్ ను రెగ్యూలేట్ చేసే సెబీ చైర్పర్సన్ పెద్ద ఎత్తున అదానీ గ్రూపుల్లో పెట్టారని తాజాగా హిండెన్‌బర్గ్ ఆరోపించింది. నిజానికి అదానీ గ్రూపుల్లో పెట్టుబడి పెట్టడం నేరం కాదు. తప్పు అంత కన్నా కాదు. కానీ అదానీ గ్రూపులపై వచ్చిన ఫేక్ పెట్టుబడుల విషయంలో సెబీ విచారణ జరిపింది. ఏం లేదని నివేదిక ఇచ్చింది. ఆ కారణంగా సుప్రీంకోర్టు కూడా అదానీకి క్లీన్ చిట్ ఇచ్చింది. కానీ విచారణ జరిపిన సెబీ కి చైర్ పర్సన్‌గా అదానీ పెట్టుబడిదారు ఉండటం కరెక్టేనా.. ఇంకా చెప్పాలంటే అది పరస్పర విరుద్ధ ప్రయోజనాల కిందకు వస్తుంది కదా అనేది హిండెన్ బర్గ్ చెబుతున్న మాట.
హిండెన్ బెర్గ్ ఆరోపణల్ని సెబీ చైర్ పర్సన్ ఖండించడం లేదు. తము తప్పేమీ చేయలేదంటున్నారు కానీ పెట్టుబడులు పెట్టలేదని చెప్పడం లేదు. దీంతో హిండెన్ బర్గ్ కూడా.. ఇదే వాదనను బలంగా చూపిస్తోంంది. ఎందుకు పెట్టుబడులు లేవని వాదించడం లేదని.. అంటే అదానీ గ్రూపుల్లో వివాదం ప్రారంభమైన తర్వాత కూడా పెట్టుబడులు పెట్టిన మాట వాస్తవమే కదా అని ప్రశ్నిస్తోంది. దీనికిసెబీ చైర్ పర్సన్ వద్ద సమాధానం లేదు.
అదానీని హిండెన్ బెర్గ్ వేటాడుతోంది. విజిల్ బ్లోయర్ పేరుతో పెద్ద ఎత్తున అదానీ గ్రూపు సమాచారాన్ని హిండెన్ బెర్గ్ కు ఇండియా నుంచే చేరుతోంది. వారు ఏ మాత్రం భయపడకుండా బయటపెడుతున్నారు. మొత్తంగాచూస్తే అదానీ షేర్లు ఇవాళ నష్టపోవచ్చు కానీ.. మరరోో వారం తర్వాత కామన్ అయిపోతాయి. ఐదేళ్ల తర్వాత ప్రభుత్వం మారితేనే అసలు అదాని గ్రూపు పెట్టుబడులు అవకతవకలపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.