బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరికల విషయంలో కేసీఆర్ సెంటిమెంట్ ను బ్రేక్ చేసేలా కాంగ్రెస్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందా? ఎందుకు ఆరు నెంబర్ పైనే ప్రధానంగా కాంగ్రెస్ గురి పెట్టింది..? ఇప్పుడిదే అంశంపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.
బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసుకోవడమే లక్ష్యంగా ఆపరేషన్ ఆకర్ష్ కొనసాగిస్తోన్న కాంగ్రెస్..ఆరు నెంబర్ పై గట్టిగా ఫోకస్ పెట్టింది. ఆరుగురు ఎమ్మెల్యేలు , ఆరుగురు ఎమ్మెల్సీ వద్ద చేరికలకు కాస్త బ్రేక్ ఇచ్చిన కాంగ్రెస్.. మళ్లీ ఆరు నెంబర్ తోనే చేరికలను షురూ చేస్తోంది. ఒకరిద్దరూ ఎమ్మెల్యేలు మధ్యలో కాంగ్రెస్ లో చేరినా..రేపోమాపో మరో ఆరుగురు కాంగ్రెస్ లో చేరుతారని తాజాగా దానం చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారింది.
కేసీఆర్ సెంటిమెంట్ పై దెబ్బకొట్టి, ఆయన మనోస్థైర్యాన్ని దెబ్బతీసేందుకే కాంగ్రెస్ ఈ రకమైన స్ట్రాటజీ అవలంభిస్తుందా..? అనే చర్చ జరుగుతోంది. కేసీఆర్ లక్కీ నెంబర్ ఆరు కావడంతో ఆ నెంబర్ తోనే బీఆర్ఎస్ ను చెడుగుడు ఆడుకోవాలనే వ్యూహంతోనే.. ఆపరేషన్ ఆకర్ష్ లోనే ఆరు నెంబర్ ను ప్రయోగిస్తున్నారని అంటున్నారు.
బీఆర్ఎస్ ఎల్పీ విలీనం వరకూ ఇదే నెంబర్ తో బీఆర్ఎస్ ను దెబ్బతీస్తారని.. చివరగా అదే నెంబర్ తోనే చేరికలకు ఎండ్ కార్డ్ వేసి ఆపరేషన్ ఆకర్ష్ కు ముగింపు పలుకుతారన్న టాక్ వినిపిస్తోంది.