పెద్ద తిరుపతి వెళ్లలేని వారికి చిన్న తిరుపతి దగ్గరవుతుంది. శబరిమలై వెళ్లలేని ఆంధ్రులకు ద్వారపూడి వుండనే వుంది. ఇవన్నీ భక్తుల సంగతి.
ప్రేమ యాత్రలకు బృందావనం వెళ్లలేని వారికి ఊళ్లే పార్కే మహా ప్రసాదంలా కనిపిస్తుంది.
డబ్బున్న ధిలాసా బాబులకు లాస్ వెగాస్ నే డెస్టినేషన. కానీ మరీ అస్తమాటూ అంతదూరం, అన్నిగంటల ప్రయాణం అవసరమా? అనుకుంటే గోవా వుండనే వుంది. రారమ్మని పిలుస్తూనే వుంటుంది.
కానీ ఈ మథ్య చాలా మందికి శ్రీలంక, కొలంబో మాంచి విడిదిపట్టుగా మారింది. టాలీవుడ్ జనాలే కాదు, ఆంధ్రలో జేబులో కాస్త పైసలు గలగల లాడే అందరూ ఛలో కొలంబో అనడం కామన్ అయిపోయింది. అంతెందుకు మొన్న పోలింగ్ అయిపోగానే, అనకాపల్లి వైకాపా అభ్యర్థి అమర్ నాధ్ కూడా ఫ్రెండ్స్ తో ఛలో కొలంబో అన్నారు.
దేనికి? లాస్ వెగాస్ అయినా, గోవా అయినా, కొలంబో అయినా ఒకటే పని. జూదశాలలు. మన టాలీవుడ్ జనాల్లో చాలా మంది ఈ జూదశాలలు మహా ప్రీతి. గోవా జనాలు అయినా, కొలంబో వారు అయినా రెగ్యులర్ కస్టమర్లకు ఇచ్చే సదుపాయాలే వేరు. కలుగచేసే అతిథి మర్యాదలే వేరు.
కానీ కథ అడ్డటం తిరిగింది. తీవ్రవాదులు దారుణానికి పాల్పడ్డారు. 200 మందిని పొట్టన పెట్టుకున్నారు. ఈ దారుణం, దీని వ్యవహారం అంతా అలా వుంచుదాం. ప్రస్తుతానికి దీనివల్ల మన టాలీవుడ్ రెగ్యులర్ కస్టమర్లు ఒక్కసారి ఉలిక్కిపడ్డారు. తాము రెగ్యులర్ గా వెళ్లే కాసినోలు, హోటళ్లు, ఇప్పుడు బాంబులు పేలిన ప్రాంతాలు తలుచుకుని, బేరీజు వేసుకుని, గుండెల మీద చేతులు వేసుకున్నారు.
అలా అని అర్జంట్ గా కేసినోలకు బైబై చెప్పేసే జనాలు కాదు మన సినిమా ఇండస్ట్రీ రిలేటేడ్ వాళ్లు అంతా. అందుకే సింపుల్ గా మనకు గోవా వుందిగా అంటున్నారు. ఇక కొన్నాళ్ల పాటు గోవానే మన డెస్టినేషన్ అని ఫిక్స్ అయిపోతున్నారట. అలవాటైపోయిన ప్రాణాలు ఇలాగే వుంటాయి మరి.