ఈ అర్థిక సంంవత్సరం మొదటి ఆరు నెలల్లో దేశంలో ద్విచక్ర వాహనాల అమ్మకాల్లో వృద్ధి 26 శాతంగా నమోదైంది. దేశం అంటే రాష్ట్రాలు… అన్ని రాష్ట్రాల్లోని అమ్మకాలు కలుపుకుంటే అంత శాతం నమోదైంది. కొన్ని రాష్ట్రాల్లో 40 శాతం ఉండొచ్చు.. మరికొన్ని రాష్ట్రాల్లో 20 శాతం ఉండొచ్చు.. కానీ ఏపీలో మాత్రం ఏ మాత్రం వృద్ధి లేకపోగా 6.5 శాతం తగ్గువగా నమోదైంది. అంటే నెగెటివ్ వృద్ధి. ఇలా దేశంలో మరే రాష్ట్రంలోనూ లేదు. ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే బైక్ సేల్స్ తగ్గిపోయాయి. ఒక్క బైకుల విషయంలోనే కాదు.. అన్ని రకాల వాహనాల్లోనూ గత ఏడాదితో పోలిస్తే 1.7శాతం తక్కువ నమోదయ్యాయి.
పొరుగు రాష్ట్రాల్లో కొనుగోళ్ల విప్లవం !
గత ఏడాది ఏప్రిల్ – సెప్టెంబర్ మధ్య ఏపీలో 3,31,695 ద్విచక్ర వాహనాలు అమ్ముడయ్యా.ి ఈ ఏడాది ఏప్రిల్ – సెప్టెంబర్ మధ్య వీటి సంఖ్య 3,10,054 . అదే జాతీయ స్థాయిలో గత ఏడాది 53,37,389 ద్విచక్ర వాహనాలు అమ్ముడైతే.. ఈ ఏడాది వాటి సంఖ్య.. 67,27,806. అంటే ఇరవై ఆరు శాతం వృద్ధి. ఇలా నెగెటివ్ వృద్ధిరేటు ఉన్న రాష్ట్రం దేశంలో ఏపీ ఒక్కటే. పొరుగున ఉన్న కర్ణాటకలో అయితే.. ఏకంగా 58 శాతం అమ్మకాలు పెరిగాయి. తమిళనాడులో ఈ పెరుగుదల శాతం 31.
దిగజారిపోయిన ఏపీ ప్రజల ఆర్థిక పరిస్థితి !
దేశం మొత్తం వృద్ధి ట్రెండ్ ఉంటే.. ఏపీలో మాత్రమే నెగెటివ్ ట్రెండ్ ఎందుకు ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఏపీ ప్రజలు ఆర్థికంగా చితికిపోయారు. ప్రభుత్వ విధానాల కారణం… పథకాల డబ్బులతో గడిపేసేవారు పెరిగిపోయారు. పని చేసే వాళ్లు తగ్గిపోతున్నారు. ఇసుక.. సంపద… ఉపాధి మొత్తం ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోతోంది. అందుకే ఏపీ ప్రజల ఆదాయం పడిపోయింది. రుణాల లభ్యత ఎక్కువగా.. రుణం పెట్టి తీసుకునేందుకు కూడా పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. కట్టలేని పరిస్థితులు ఉండటం వల్ల వెనుకడుగు వేస్తున్నారని మోటార్ ఇండస్ట్రీ ప్రతినిధులు నేరుగా చెబుతున్నారు.
అధిక పన్నులు కూడా కారణమే !
ఏపీలో యాభై వేల పైబడిన బైకులకు పన్నెండు శాతం పన్ను విధిస్తున్నారు. ఏ బైక్ అయినా ఇప్పుడు యాభై వేలకు తక్కువ లేదు. ఈ కారణంగా అదనంగా మరో రూ. 163 కోట్ల ఆదాయాన్ని ప్రభుత్వం పొందాలని లక్ష్యంగా పెట్టుకుంది. అదే సమయంలో పెట్రోల్ రేటు ఏపీలోనే అత్యధికంగా ఉంది. అదనంగా రోడ్ సెస్‌లు వేస్తున్నారు. రోడ్లను వేయడం లేదు. అత్యంత దారుణంగా రోడ్ల పరిస్థితి ఉంది. అందుకే సేల్స్ పడిపోయాయి.
ప్రభుత్వ విధానాలను ప్రజల్ని .. వారి ఆర్థిక పరిస్థితుల్ని ఎంత దారుణంగా చిదిమేస్తాయో.. ప్రస్తుతం ఏపీలో బయటపడుతోంది. ముందు ముందు ఈ పరిస్థితి మరితం దారుణంగా ఉండనుంది.