గీతం కాలేజీ భూకబ్జా చేసిందో లేదో కానీ.. దశాబ్దాల నాటి వివాదాన్ని అడ్డం పెట్టుకుని వివాదం కోర్టులో ఉన్నప్పటికీ.. హడావుడిగా అర్థరాత్రి పూట భవనాలు కూలగొట్టేశారు. దేశవ్యాప్తంగా మంచి పేరు ఉన్న ప్రైవేటు డీమ్డ్ వర్శిటీల్లో గీతంకు ఇలాంటి పరిస్థితి రావడం చాలా మంది విద్యారంగ నిపుణుల్ని విస్మయపరిచింది. అలా భవనాలు కూల్చివేతతోనే ఆగలేదు. ప్రభుత్వం తరపున భవనాల కూల్చివేత జరగింది.. వైసీపీ పార్టీ తరపున విజయసాయిరెడ్డి రంగంలోకి దిగారు. ఆయన అదే పనిగా.. ఉన్నత విద్యను పర్యవేక్షించే కేంద్ర విభాగాలకు ఫిర్యాదులు చేయడం ప్రారంభించారు. గీతంలో ఎన్నో అక్రమాలు జరిగాయని.. జరుగుతున్నాయని తక్షణం గీతంను మూసేయాలని ఆయన లేఖల సారాంశం. ఒకటి రాసి వదిలి పెట్టడం లేదు.
వారానికో లేఖ రాస్తూనే ఉన్నారు. ఏఐసీఈటీకి..మెడికల్ కౌన్సిల్‌కు ఇలా రాస్తూనే ఉన్నారు. నిజానికి ఆ రెగ్యూరేటరీ సంస్థలన్నీ గీతంను ఎప్పటికప్పుపు పరిశీలించే అనుమతులు ఇస్తూ ఉంటాయి. కొత్తగా విజయసాయిరెడ్డి చెప్పాల్సిన పనిలేదు. కానీ ప్రస్తుతం.. రాష్ట్రంలో పేరెన్నికగన్న సంస్థలను నిట్టనిలువునా కూల్చేయడమే లక్ష్యమన్నట్లుగా వైసీపీ విధానం ఉంది. హైదరాబాద్, బెంగళూరులో కూడా భారీ క్యాంపస్‌లు నిర్వహిస్తున్న గీతంకు విద్యాపరంగా మంచి పేరు ఉంది. ఉత్తరాది నుంచి పెద్ద ఎత్తున విద్యార్థులు వచ్చి చేరుతూ ఉంటారు. విశాఖ క్యాంపస్‌కు మరింత పేరు ఉంది.
అలాంటి సంస్థపై ఇంత కసితో ఎందుకు ఫిర్యాదులు చేస్తున్నారో.. కూల్చివేతలకు పాల్పడుతున్నారో చాలా మందికి అర్థం కావడంలేదు. కానీ అందరికీ తెలిసిన ఎజెండా ప్రకారం.. గీతం.. ఓ సామాజికవర్గప్రముఖులది. ఆ సామాజికవర్గం వారెవరైనా పెద్ద పెద్ద సంస్థలు నిర్వహిస్తే.. సహించలేరు.. నిట్ట నిలువునా కూల్చేయాలన్న సిద్ధంతాన్ని ప్రభుత్వ పెద్దలు పెట్టుకున్నారు కాబట్టి.. ఆ దిశగా అడుగులు వేస్తున్నారని.. గీతంను టార్గెట్ చేశారని అంటున్నారు. చూస్తూంటే అదే నిజమేమో అన్న అభిప్రాయం కలిగేలా వ్యవహరిస్తున్నారు మరి..!