‘సైరా’ టీమ్ లో మార్పులూ చేర్పుల విషయం ఇప్పటికీ మీడియాలో హాట్ టాపిక్కే. ఎవరు ఎప్పుడు వస్తారో, ఎవరు పక్కకు తప్పుకుంటారో అర్థం కాని పరిస్థితి. ఓ దశలో సురేందర్ రెడ్డి స్థానానికీ ముప్పు ఏర్పడింది. ఆ ప్లేస్‌లో వి.వి.వినాయక్ వస్తారని ప్రచారం జరిగింది. అయితే ఏదోలా సూరి తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. కాకపోతే ఇష్యూ…. వినాయక్ వరకూ వెళ్లింది. ‘సైరా’కి టేకప్ చేయడానికి వినాయక్ సిద్ధంగా లేకపోవడంతో… సూరి టీమ్ లో ఉండిపోయాడు.
వినాయక్ ‘సైరా’కి నో చెప్పడానికి రెండు బలమైన కారణాలున్నాయని భోగట్టా. ఒకటి.. అప్పటికే ‘సైరా’ సినిమాపై వర్క్ జరిగింది. మళ్లీ తను వచ్చాక ఈ కథపై కనీసం ఆరు నెలలైనా కూర్చోవాలి. తన వల్ల `సైరా` ఆలస్యం అవుతుంది. కాబట్టి వినాయక్ ‘నో’ చెప్పాడు.
రెండో పాయింట్… సూరికీ తనకు మంచి అనుబంధం ఉంది. ఈ సినిమా ఒప్పుకోవడం వల్ల అదెక్కడ చెడిపోతుందో అని వినాయక్ కాస్త జంకాడట. ”సూరి బాగా చేస్తాడు. తనకు టెక్నికల్‌గా బాగా నాలెడ్జ్ ఉంది. పైగా ఈసినిమాపై చాలా వర్క్ చేశాడు. నాకంటే.. తనే ఈ కథకు న్యాయం చేయగలడు” అని చిరంజీవితో వినాయక్ చెప్పినట్టు సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. సో… ‘సైరా’ నుంచి వినాయక్ అలా తప్పుకోవాల్సివచ్చింది.