వైఎస్ఆర్సీపీ నేతల వేధింపులు భరించలేక వివిధ స్థాయిల్లో టీడీపీ నేతలు.. ఇతరులు ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు తరచూ బయటపడుతున్నాయి. ఇప్పుడు సొంత పార్టీ నేతల వేధింపులు, భూకబ్జాల కారణంగా ఆ పార్టీ నేతలే ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు కూడా పెరుగుతున్నాయి. తాజాగా కుప్పం నియోజకవర్గంలో పార్థసారధి అనే వైసీపీ నేత చాలా మంది పేర్లు పేర్లు చెప్పి సెల్ఫీ వీడియో తీసుకుని రైలు కిందపడ్డారు. ఆయన వైసీపీ కోసం చాలా కష్టపడినా డబ్బులు తీసుకుని గంగమ్మ ఆలయ చైర్మన్ పదవి ఇచ్చారు.ఇప్పుడుఅది కూడా తీసేశారు.
దాంతో ఆయన అప్పులు తీరే దారి లేక.. పదవి కూడా లేకప్రాణాలు తీసుకున్నారు. ఆయన మృతదేహాన్ని వైసీపీకే దానమిస్తున్నామని ఆయన కుటుంసభ్యులు ప్రకటన చేయడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఇటీవలి కాలంలో చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గానికి చెందిన ఓ చోటా నేత కూడా ఇదే రంగా సెల్ఫీ తీసుకుని అడవిలోకి వెళ్లిపోయాడు. ఏలాగోలా ఆత్మహత్య చేసుకోకుండా కాపాడారు. ఆయన కూడా డబ్బులు.. కబ్జాలతో విసిగిపోయారు.
కొన్నాళ్ల క్రితం అనంతపురం జిల్లా పుట్టపర్తి మున్సిపల్ వైఎస్సార్సీపీ కోఆప్షన్ మెంబర్ ఆదం అహ్మద్ కూడా వీడియో తీసుని రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆయనకూ అప్పులే కారణం. ఇలా వైసీపీని నమ్మకుని అధికారంలోకి రాక ముందు లక్షలు ఖర్చు పెట్టుకుని అధికారంలోకి వచ్చాక కూడా పదవుల కోసం లక్షలు సమర్పించుకున్న వారు ఇప్పుడు పూర్తిగా చితికిపోయారు. బిల్లులు కూడా రాక అనేక మంది ఒత్తిడికి గురవుతున్నారు. ఈ పరిస్థితి వైసీపీలోనూ అందోళన కలిగిస్తోంది.