రాయలసీమ, నెల్లూరు జిల్లాలను వరదలు ముంచెత్తితే ప్రభుత్వం వారం రోజుల్లోనే సాయం చేసేశామని డిక్లేర్ చేసింది. ప్రభుత్వం సాయం చేసిందో లేదో తర్వాత సంగతి కానీ అక్కడి ప్రజలు మాత్రం పడుతున్న ఇబ్బందులు ఇంకా ఉన్నాయి. ఎన్టీఆర్ ట్రస్ట్ వంటి కొన్ని స్వచ్చంద సంస్థలు నిరంతరాయంగా సేవలు అందిస్తున్నాయి. కొంత మంది ప్రతిపక్ష పార్టీల నేతలు సాయం చేస్తున్నారు. కానీ వైసీపీకి చెందిన నేతలు ఒక్కరంటే ఒక్కరూ వితరణ చేస్తున్న పరిస్థితి కనిపించడం లేదు. ప్రభుత్వం నుంచి కేబినెట్ ర్యాంక్ పొంది ఏ ఉపయోగపడే పని చేయని పండుగాయల రత్నాకర్ అనే వ్యక్తి ఓ ఇరవై చిన్న సిలిండర్లను పంపిణీ చేసి దానికి కవరేజీ కోసం అంత కంటే ఎక్కువే ఖర్చు పెట్టారు. తన నియోజవర్గంలో జరిగింది ప్రజలు ఎక్కడ తిరగబడతారో అని ఓ మూడు రోజులు బాధితులకు తన ఇంటి వద్ద భోజనాలు పెట్టారు ఎమ్మెల్యే మల్లిఖార్జునరెడ్డి. అంతే ఇక ఎవరూ కనిపించలేదు.
అదే కరోనా వల్ల స్థానిక ఎన్నికలు వాయిదా పడినప్పుడు ఏం జరిగిందో ఒక్క సారి గుర్తుకు తెచ్చుకుంటే అబ్బో..వైసీపీ నేతలకు ఎంత సేవా దృక్పథం అని అనుకోక తప్పదు. ప్రతి ఇంటికి నిత్యావసర వస్తువువులు పంపిణీ చేశారు. బియ్యం మధుసూదన్ రెడ్డి లాంటి వాళ్లు కరోనా పెరుగుతుందని తెలిసినా ట్రాక్టర్ల కొద్దీ బియ్యాని పెట్టుకుని ర్యాలీలు తీసి పంచారు. రాష్ట్రం మొత్తం ఇలా పంచారు. ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో తెలియక ఆ పంచుడు కొనసాగించారు.
అంతకు ముందు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు.. ఐదు రూపాయలకే అన్నం పెట్టేలా ఎన్టీఆర్ క్యాంటీన్లు ప్రారంభిస్తే పోటీగా రూ. నాలుగు రూపాయలకే భోజనం పెట్టేలా వైసీపీ నేతలు రాజన్న క్యాంటీన్లు ప్రారంభించారు. రోజా సహా అందరూ వాటిని సొంత ఖర్చులతో ప్రారంభించారు. ఎన్టీఆర్ క్యాంటీన్లలో తినవద్దని ప్రచారం చేసి.. తమ వద్దే తినాలన్నారు. దానికి అనుగుణంగా బాగానే పెట్టారు. ఆహా ఏమీ సేవ అనుకున్నారు. కానీ ఇప్పుడు అన్నక్యాంటీన్లు లేవు.. రాజన్న క్యాంటీన్లు లేవు. అది వేరే విషయం. అప్పట్లో వరదలు లాంటి విపత్తలు వస్తే తామున్నామంటూ వైసీపీ నేతలు సేవా కార్యక్రమాలు చేపట్టే వాళ్లు. ఇప్పుడు వరదల్లో అసలు కనిపించనేకనిపించడం లేదు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అవసరానికి మాత్రమే ప్రజల్ని ఆదుకునేందుకు ప్రయత్నిస్తారు. అవసరం లేకపోతే అసలు కంటికి కూడా కనిపంచరని రాయలసీమ వరదలతోనే స్పష్టమయిపోయిందన్న అభిప్రాయంప్రజల్లో వినిపిస్తోంది. సొంత జిల్లాపై ప్రేమ ఎక్కువ అని నోటి మాట ద్వారా చెబుతున్న జగన్ .. చేతల్లో కనీసం బాధ కూడా వ్యక్తం చేయలేకపోయారు. మిగతా నేతలంతా అలాగేనని ప్రజలు నిట్టూరుస్తున్నారు.