మామూలుగా చంద్రబాబు ప్రతి జిల్లాలోనూ పర్యటిస్తున్నారు. అక్కడకు వెళ్లేటప్పుడు… సాధారణ పర్యటనలుగానే.. ప్రచారంలోకి వస్తున్నాయి. కానీ అమరావతి పర్యటనపై… ప్రభుత్వం, వైసీపీనే.. ప్రజల అటెన్షన్ కలిగేలా చేసింది. అడ్డుకుంటామనే ప్రకటనలు చేయడం.. ఒక కారణం అయితే.. ప్రభుత్వమే స్పందించి.. తాము నిర్మాణాలు కొనసాగిస్తామని చెప్పడం.. మరో కారణం. అంతే కాకుండా సాక్షి పత్రికలో.. చంద్రబాబు అమరావతిని నాశనం చేశారంటూ.. పుంఖాను పుంఖాలుగా కథనాలు రాస్తున్నారు. దీంతో.. ప్రజల్లోనూ.. చంద్రబాబు టూర్‌తో.. ఏదో జరగబోతోందన్న అభిప్రాయం ఏర్పడింది. చంద్రబాబు పర్యటనపై.. వైసీపీనే ప్రజల్లో అటెన్షన్ క్రియేట్ చేసింది.
చంద్రబాబు ఇలా అమరావతి పర్యటన షెడ్యూల్ ఖరారు చేసుకోగానే.. ప్రభుత్వంలో.. వైసీపీలో ఒక్క సారిగా కదలిక వచ్చింది. ప్రభుత్వం ముందుగా..సీఆర్డీఏ సమీక్ష నిర్వహించింది. ఇప్పటి వరకూ.. అమరావతి నిర్మాణాల విషయంలో… ఒక్క ఇటుక కూడా వేయకూడదన్న విధానంలో ఉన్న ఏపీ సర్కార్… చంద్రబాబు ప్రకటన ఖరారు కాగానే.. యూటర్న్ తీసుకుంది. నిర్మాణాలను ఆపొద్దని.. సీఎం..సీఆర్డీఏ అధికారులకు చెప్పారంటూ.. మీడియాకు సమాచారం అందింది. ఆరు నెలల పాటు ఆగిపోయిన నిర్మాణాలను కొత్తగా ఆపొద్దని చెప్పడం ఏమిటన్న విమర్శలు వచ్చాయి కానీ…మళ్లీ నిర్మాణాలు ప్రారంభించమన్నారన్న ఆనందం మాత్రం రైతుల్లో కనిపించింది.
చంద్రబాబు పర్యటన ఖరారు కాగానే.. రాజధానిలో… వైసీపీ నేతలు.. మరో రకమైన ప్రచారం ప్రారంభించారు. రాజధాని అక్కడే ఉంటుందని.. అమరావతి నుంచే పాలన సాగుతుందని.. చంద్రబాబే.. అమరావతికి అన్యాయం చేశారనే ఆరోపణలు ప్రారంభించారు. భూములిచ్చిన రైతులమంటూ.. వైసీపీ మండల స్థాయి నేతలు.. చంద్రబాబు.. రాజధాని భూముల్లో ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడ్డారని ఆరోపణలు చేయడం.. ప్రభుత్వం ఆధారాలు బయట పెట్టాల్సిన అవసరం లేదని వితండ వాదనలు వినిపించడమే కాదు.. చంద్రబాబు క్షమాపణలు చెప్పాలంటూ.. కొత్త ప్రకటనలు చేయిస్తున్నారు. రాజధాని పర్యటనకు వస్తే.. అడ్డుకుంటామని ప్రకటనలు కూడా చేశారు. ఈ పరిణామాల మధ్య చంద్రబాబు… నేడు అమరావతిలో పర్యటించబోతున్నారు.\