వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు.. నవరత్నాల గురించి చెప్పడం లేదు. ప్రజలకు ఎలా మేలు చేస్తామో చెప్పడం లేదు. ప్రత్యేకహోదా ప్రస్తావన లేదు. వైసీపీ గెలిస్తే.. రాష్ట్రానికి ఏం చేస్తారో చెప్పడం లేదు. కానీ… ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి.. ఓ ఎజెండాను మాత్రం అమలు చేస్తున్నారు. అదే… ఓ సామాజికవర్గాన్ని టార్గెట్ చేయడం.. చంద్రబాబు సామాజికవర్గం పేరుతో… సాగుతున్న ఈ ప్రచారాన్నే ఆయన నమ్ముకున్నారు. ఈ కులం కోణమే.. ఆయనకు చివరికి అస్త్రంగా మారింది. ఇది గెలుపు సాధించి పెడుతుందా..?
పోలీసులకు “కులాన్ని” అంట గట్టి ప్రారంభోత్సవం..!
కొద్ది రోజుల కిందట.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ఎన్నికల సంఘాన్ని కలిశారు. లోపల ఈసీకి ఫిర్యాదు చేశారో లేదో కానీ.. బయటకు వచ్చి… ఏపీ పోలీసుల్లో అందరూ.. చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన వారే ఉన్నారని.. వారికే ప్రమోషన్లు ఇస్తున్నారని… తెలుగు, ఇంగ్లిషుల్లో చెప్పారు. నిజానికి అప్పటి వరకు పోలీసులపై నమ్మకం లేదనే మాట మాత్రమే జగన్ చెప్పేవారు.. ఈ సారి వారికి కులం కోణం అంటగట్టారు. జగన్ చేసిన ఆరోపణల్లో … ఒక్క శాతం కూడా నిజం లేదని .. పోలీసు శాఖ .. గణంకాలు విడుదల చేసింది. పోలీసు శాఖ డీఎస్పీల్లో.. ఇద్దరు మాత్రమే చంద్రబాబు సామాజికవర్గం వారు ఉన్నారు. ఆరురుగు జగన్ కు చెందిన రెడ్డి సామాజికవర్గం వారున్నారు. కానీ.. అసలు చంద్రబాబు సామాజికవర్గం వారు.. పోలీసు ఉద్యోగాలు చేయడమే నేరమన్నట్లుగా.. ఆయన పార్టీ నేతలు ప్రచారం ప్రారంభించారు. ఇది మొదటి స్టేజ్.. తర్వాత.. ఇది.. మరింతగా పెరిగిపోయింది.
నేతల్ని చేర్చుకుని చంద్రబాబు కులంపై దుమ్మెత్తి పోయడం..!
పోలీసులపై చేయాల్సినంత కులం దుష్ప్రచారం చేసి.. ఇప్పుడు.. కొత్త వ్యూహం ప్రారంభించారు జగన్మోహన్ రెడ్డి. పార్టీలో టీడీపీ నేతల్ని చేర్చుకోవడమే కాదు.. వారితో… అప్పటి వరకూ ఉన్న తెలుగుదేశం పార్టీపై తీవ్ర విమర్శలు చేయిస్తున్నారు. అప్పటి వరకూ టీడీపీని పొగిడి.. చంద్రబాబును… అభినందించి.. లోటస్ పాండ్ లోకి వెళ్లి బయటకు రాగానే.. అన్నీ మర్చిపోతున్నారు నేతలు. అంతే కాదు.. వ్యూహాత్మకందా.. అంతా సామాజికవర్గ కోణం తీసుకువస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి.. ఓ సామాజికవర్గాన్ని టార్గెట్ చేసి… విమర్శలు ప్రారంభించారు. ఒక్క సామాజిక కోణంలోనే టీడీపీ పై విమర్శలు చేయడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆమంచి కానీ..అవంతి కానీ.. చేసిన ఆరోపణలు ఇవే. అది రాజకీయ వ్యహం. ఓ సామాజికవర్గంపై.. దాడి చేసి రాజకీయ లబ్ది పొందే వ్యూహం. చివరికి ఇరవై ఏళ్ల పాటు రాజకీయాలకు దూరంగా ఉండి.. చంద్రబాబు ఏమీ చేయలేదని ఫీలైపోయి.. ఇప్పుడు వైసీపీ టిక్కెట్ ఇస్తాననగానే ఆ పార్టీలో చేరిన దాసరి జై రమేష్ అనే పెద్ద మనిషి.. కూడా.. చంద్రబాబుపై కులం ముద్ర వేస్తున్నారు. మరి ఆయన కూడా చంద్రబాబు సామాజికవర్గమేగా…! చంద్రబాబు ఎందుకు ప్రాధాన్యం ఇవ్వలేదు..?.లాంటి ప్రశ్నలకు లాజిక్‌లు ఉండవు.
ఓ కులంపైకి అందర్నీ రెచ్చగొడితే తప్ప జగన్ గెలవలేరా..?
జగన్‌ది ఫ్యాక్షన్ టైప్ మెంటాలిటి. ఎవరైనా తనకు అడ్డు వస్తే.. భౌతికంగా అయినా సరే నిర్మూలించాలన్నత.. కసిని తన మాటల్లో చూపిస్తూంటారు. ఆయన మాటల్లో… కాల్చి పారేయడం.. పొడిచి చంపడం.. అనే మాటలు తరచూ వినిపిస్తూంటాయి. దేని గురించి చెప్పాలన్నా.. ఆయన హింసా ప్రవృత్తినే గుర్తు చేసేలా మాట్లాడుతూంటారు. చంద్రబాబు నల్ల చొక్కా వేసుకుని.. నిరసన వ్యక్తం చేస్తే .. ‘ మనిషిని పొడిచి చంపినోడే.. సంతాపం వ్యక్తం చేసినట్లుంది “అంటారు. జగన్‌కు చంద్రబాబు అడ్డు వస్తున్నారని అనిపిస్తే.. కాల్చి చంపినా తప్పులేదంటారు. ఇలా.. ఆయన మైండ్‌సెట్‌కు తగ్గట్లే.. ఇప్పుడు కులం పై.. విరుచుకుపడుతున్నారు. ఓ సామాజికవర్గంపై అందర్నీ రెచ్చగొట్టి…తను పబ్బం గడుపుకోవాలనకుంటున్నారు.
జగన్ ఆడుతున్న ఈ గేమ్‌లో… చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన వారు కూడా కీలకంగా మారుతున్నారు. వీరిలో కొంత మంది మాజీ టీడీపీ నేతలు ఉంటున్నారు. నిజంగా చంద్రబాబు ఆయన కులానికి ప్రాధాన్యం ఇస్తే… వారు బయటకు వెళ్లి .. తన సామాజికవర్గాన్నే తిడుతున్న జగన్‌కు..మద్దతుగా ఉండేవారు కాదు. ఈ సామాజికవర్గ ప్రాధాన్యం లెక్కలు తీస్తే.. జగన్ పార్టీలో.. ఆయన సామాజికవర్గం వారు తప్ప ఎవరూ కనిపించరు. కానీ… జగన్ రూటే వేరు..!