- ఆమె వయస్సు 35… ప్రియుడి వయస్సు 25
- భర్తకు తెలియకుండా రహస్యంగా ప్రియుడితో రాసలీలలు
- భర్త, ఇద్దరు కుమార్తెల్ని వదిలి గోవాకు వెళ్లిపోయిన మహిళ
- భార్యకు తెలియకుండా ఆమె కారుకు జీపీఎస్ అమర్చిన భర్త
- జీపీఎస్ ద్వారా భార్య జాడ కనుక్కున్న భర్త
- ప్రియుడితో ఉన్న తన భార్యను పట్టుకోవాలని పోలీసుల్ని కోరిన భర్త
కోట్ల రూపాయల అస్తులు ఉన్నాయి. సమాజంలో మంచి పేరున్న భర్త ఆమెకు అండగా ఉన్నాడు. వ్యాపారవేత్తగా దుసుకుపోతున్న ఆ భర్తతో ఆమెకు ఇద్దరు కుమార్తలు కుడా ఉన్నారు. ఇలా సంతోషంగా సాగుతున్న కాపురంలో మూడో వ్యక్తి ప్రవేశించాడు. అందంగా ఉన్న భార్యపై కన్నువేశాడు. తనకంటే వయసులో 10 ఏళ్లు పెద్దయిన పాటించుకోలేదు. వయసులో చిన్నోడైన వ్యక్తితో గుట్టుగా ఈ ఇద్దరు పిల్లల తల్లి ప్రేమాయణం మొదలుపెట్టింది. 25 ఏళ్ల కూరాడితో షికారులు కూడా వెళ్తోంది. విషయం కనిపెట్టిన భర్త, ఆమె కారుకు జిపిఎస్ ట్రాకర్ పెట్టాడు. ఆమె ప్రతి కదలికను గమనిస్తు వచ్చాడు. ఇలా ఒక రోజు పిల్లలను వదిలెసి ప్రియుడితో కలిసి గోవాకు వెళ్లిన భార్యను జిపిఎస్ ద్వార పట్టుకున్నాడు భర్త. పెళ్లి చేసుకొని వైవాహిక బంధాన్ని విచ్చిన్నం చేసి, నమ్మక ద్రోహానికి పాల్పడిన భార్యపై బాధిత భర్త సాక్షలతో పోలిసులకు ఫిర్యాదు చేశాడు.
వివరాల్లోకి వెళ్తే…
ఆమె వయస్సు 35 ప్రియుడి వయసు 25. వయస్సులో పదేళ్ల చిన్నోడైన మాధవ్ కు ఇంకా పెళ్లి కాలేదు. ఆమెకు పెళ్లై ఇద్దరు కుమార్తెలున్నారు. భర్త బిజినెస్ పనిమీద హైదరాబాద్, నెల్లూరు, విజయవాడకు క్యాంపులకు వెళ్తుంటాడు. ఈమె కూడా అప్పుడుప్పుడు వ్యాపారపనులు చూసుకుంటూ ఉంటుంది. ఓ రోజు కారు వాష్ చేయించేందుకు వెళ్లిన ఆమెకు అక్కడి యజమానైన మాధన్ పరిచయమయ్యాడు. ఆ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. ఇద్దరూ కలిసి చాటింగ్ లు చేసుకోవడం, రహస్యంగా రాసలీలలు కొనసాగించేవారు. మాధవ్ ప్రేమలో మునిగి తేలుతూ భర్త, పిల్లల్ని పట్టించుకునేది కాదు. ఓ రోజూ వారిద్దరూ అమీర్ పేట్ ధరంకరంరోడ్డులో రహస్యంగా కలుసుకున్న సమయంలో ఇంట్లోని పడక గదిలో వారిద్దర్నీ భర్త రెడ్ హాడెండ్ గా పట్టుకున్నాడు. భర్తను చుసి బోరున ఏడ్చి తను ఇంకా ఇలాంటి తప్పులు చేయనని మన్నించమని కోరింది. కొన్ని రోజుల తర్వాత పుట్టింటికి వెళ్లిపోతానని చెప్పిన ఆమె కారులో ప్రియుడ్ని ఎక్కించుకుని గోవాకు పారిపోయింది. గోవాలో ఓ హోటల్లోకి కారు చేరుకున్నట్టు జీపీఎస్ ద్వారా భర్త తెల్సుకుని ఎస్.ఆర్.నగర్ పోలీసుల్ని ఆశ్రయించాడు.
తనని మోసం చేసి నమ్మకద్రోహానికి పాల్పడ్డ తన భార్యను, ఆమె ప్రియుడు మాధవ్ ను పట్టుకోవాలని పోలీసుల్ని వేడుకుంటున్నాడు బాధితుడు. ఆమె దగ్గర తన కూతుళ్లు ఉంటే వారు చెడుదోవలోకి వెళ్లే ప్రమాదం ఉందని..పిల్లల్ని తనకు ఇప్పించాలంటున్నాడు బాధితుడు.