కట్టుకున్న భార్య.. వేరే వ్యక్తితో రాసలీలలు సాగిస్తూంటే.. ఆ భర్త సహించలేకపోయాడు. తాను లేనని.. రహస్యంగా తన ఇంట్లోనే దుకాణం పెట్టేసిన వారిని జంటగా చూసిన తర్వాత కోపాన్ని అణచుకోలేకపోయాడు. గుడియపెట్టి వెళ్లి.. పెట్రోల్ తీసుకొచ్చి.. ఇంటిపై పోసి నిప్పంటిచేశాడు. వారిద్దరూ మంటల్లో కాలిపోతూ .. హాహాకారాలు చేస్తూంటే.. సంతోషంగా చూస్తూండిపోయాడు. ఈ ఘటన నెల్లూరు జిల్లాలో జరిగింది.
నెల్లూరు కోళ్లమిట్టకు చెందిన హరిబాబు అనే వ్యక్తికి కవితతో ఐదేళ్ల కిందట పెళ్లయింది. పెళ్లికి ముందే కవితకు వేరే వ్యక్తితో వివాహేత బంధం ఉంది. పెళ్లి తర్వాత హరిబాబుకు విషయం తెలిసింది. పద్దతి మార్చుకోమని..బార్యను హెచ్చరించాడు. పెద్దలతో పంచాయతీ కూడా చేయించాడు. సరిగ్గానే ఉంటానని.. అందరి ముందు చెప్పిన కవిత.. తర్వాత దారి తప్పింది. భర్తకు తెలియకుండా… వ్యవహారం నడిపింది. కొన్నాళ్ల పాటు సీక్రెట్ గానే నడిపినా … చివరికి బయటపడింది. ఇంట్లో ఇద్దరూ ఉన్న సమయంలో.. హరిబాబుకు దొరికిపోయారు. ప్రాణాలు కోల్పోయారు. వారిద్దరూ పూర్తిగా సజీవదహనం అయ్యే వరకూ అక్కడే ఉన్న హరిబాబు తర్వాత పరారయ్యాడు. అగ్నిప్రమాదం ఎలా జరిగిందో…పోలీసులు ఆరా తీస్తే..మొత్తం వ్యవహారం బయటకు వచ్చింది.
హరిబాబు భార్యను.. ప్రేమగానే చూసుకునేవారని.. గ్రామస్తులు చెబుతున్నారు. క్షణికానందం కోసం.. కవిత .. వివాహేతర బంధం కొనసాగించడానికే మొగ్గు చూపడంతో.. ఈ ఘటన చోటు చేసుకుంందంటున్నారు. పోలీసుల హరిబాబు కోసం గాలింపు ప్రారంభించారు. టీవీ సీరియళ్లు, సినిమాలు సోషల్ మీడియా ప్రభావంతో.. విచ్చలవిడిగా మారిపోతున్న మానన సంబంధాలతో… చోటు చేసుకుంటున్న పరిణామాలకు ఈ సంఘటన ఓ ఉదాహరణగా భావిస్తున్నారు. ఇదొక్కటే కాదు.. అదీ కూడా తెలుగు రాష్ట్రాల్లోనేకాదు.. దేశవ్యాప్తంగా.. ప్రతీ మూల ఏదో చోట ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. కుటుంబ విలువలపై.. ప్రజల్లో అంతకంతకూ తగ్గిపోతూడంటంతో.. ఇలాంటి నేరాలు కూడా పెరిగిపోతున్నాయి.