ఏపీ రాజధానిపై సీఎం జగన్ తీరు చాలా స్పష్టం. ఆయన ఆ ప్రాంతాన్ని స్మశానం దగ్గర్నుంచి అనేక రకాలుగా పోల్చారు. పనికి రాదని తేల్చారు. అందుకే రాజధాని ని మార్చేస్తున్నారు. మార్చట్లేదని మరో రెండు పెడుతున్నానని ఎన్ని కబుర్లు చెప్పినా ఆయన ఉద్దేశం స్పష్టం. ఈ విషయంలో తన పంతాన్ని నెగ్గించుకునేందుకు అన్ని వ్యవస్థలనూ ధిక్కరించారు. అయినా ముందడుగు వేయలేకపోయారు. చివరికి సుప్రీంకోర్టుకు చేరింది. ఇదే పైనల్ . సుప్రీం నిర్ణయమే అమరావతి విషయంలో అంతిమం కానుంది.
సుప్రీంకోర్టు.. హైకోర్టు తీర్పును సమర్థిస్తే మూడు రాజధానుల వాదనకు ముగింపు పలికినట్లే. న్యాయనిపుణులు న్యాయం రైతుల వైపే ఉందని చెబుతున్నారు. ఎదుకంటే రైతులతో ప్రభుత్వం చట్టబద్ధమైన ఒప్పందం చేసుకుంది. ఒక్ వేళ ఆ ఒప్పంద నుంచి బయటకు రావాలంటే భారీగా పరిహారాన్ని చెల్లించాల్సి ఉంటుంది. అంతే కానీ రైతుల్ని అలా వదిలేసి వారి భూముల్ని ప్రభుత్వం వేలం వేసుకుని.. లేకపోతే తాకట్టు పెట్చుకునే అవకాశం పొందలేదు. అదే సమయంలో గతంలో రాజదానిని ఏకాభిప్రాయంతో నిర్ణయించారు. ఆ నిర్ణయంలో జగన్ కూడా భాగస్వామి.. హైకోర్టు తన తీర్పులో ఇదే విషయాన్ని వెల్లడించింది.
అందుకే అమరావతి రైతులు కూడా హైకోర్టు తీర్పుపై ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించడాన్ని సమర్థిస్తున్నారు. సుప్రీంకోర్టులోనూ ధర్మమే గెలుస్తుందని ప్రభుత్వ కుట్రలకు ముగింపు ఉంటుందంటున్నారు. ఎలా చూసినా మూడు రాజధానుల వివాదం సుప్రీంకోర్టులోనే తేలిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే అంతిమంగా సుప్రీంకోర్టులో వచ్చే తీర్పునూ జగన్ అంగీకరిస్తారా ? లేకపోతే గతంలా ఏదైనా తన రాజకీయం తాను చేస్తారా అన్నదే చర్చనీయాంశం.