కేంద్ర ప్రభుత్వం కొద్ది రోజుల కిందట మైకెల్ అనే ఓ వ్యక్తిని దుబాయ్ ప్రభుత్వం నుంచి.. రప్పించింది. అతడు.. అగస్టా వెస్ట్ ల్యాండ్ హెలికాఫ్టర్ల కేసులో… మధ్యవర్తిగా ఉన్నాడు. యూపీఏ హయాంలో… ఇతను మధ్యవర్తిగా ఉండి.. లంచాలు తీసుకున్నాడని.. డబ్బు దుబాయికి చెందిన రెండు ఖాతాల్లోకి చేరిందని దానిపై దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించింది. అగస్టా ఒప్పందం జరిగిన సమయంలో మిషెల్ 25సార్లు భారత్‌కు వచ్చారని సీబీఐ ఛార్జిషీటులో తెలిపింది. ఈ కేసు రూ.3,600కోట్ల విలువైన అగస్టా వెస్ట్‌ల్యాండ్ వీవీఐపీ హెలికాప్టర్ల ఒప్పందానికి సంబంధించినది. అప్పట్లో.. కేంద్రంతో పాటు.. ఏపీ ప్రభుత్వం కూడా ఓ అగస్టా వెస్ట్‌ల్యాండ్ హెలికాఫ్టర్ కొనుగోలు చేసింది.
2008లో నే అప్పటి ఏపీ సీఎం కోసం అగస్టా వెస్ట్‌ల్యాండ్ నుంచి ఏపీ సర్కార్ ఓ హెలిక్టాపర్ను కొనుగోలు చేసింది. 2011లో కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం అగస్టా హెలికాప్టర్లు కొనుగోలు చేసింది. అలా ఆ కంపెనీ అడుగు దేశంలో తొలిసారి తెలుగు నేలపైనే పడింది. అగస్టా కేసులో సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న మధ్యవర్తికి ఏపీతో అనుబంధం ఉందని చెబుతున్నారు. ఇటలీకి చెందిన కార్లో గెరోసా అనే వ్యక్తి సంస్థకు ఖమ్మం జిల్లాలో కారుచౌకగా భూము లు కేటాయించారన్న విమర్శలున్నాయి. అగస్టా వెస్ట్ల్యాండ్ని నిబంధనలకు విరుద్ధంగా వైఎస్ ప్రభుత్వం కొనుగోలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
అగస్టా కుంభకోణంలో సీబీఐ దర్యాప్తు చేపట్టింది. గవర్నర్ నరసింహన్‌ను కూడా ప్రశ్నించినట్లు జాతీయ మీడియా అప్పట్లోనే తెలిపింది. అగస్టా హెలికాప్టర్లు కొనుగోలు చేసే సమయంలో నరసింహన్ కేంద్రంలో ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్‌గా ఉన్నారు. హెలిక్టాప్టర్ల కొనుగోలు సందర్భం గా జరిగిన పలు సమావేశాలకు ఐబీ చీఫ్ హోదాలో నరసింహన్ కూడా హాజరయ్యారు. ఇప్పుడు ఈ కేసు ఢిల్లీలోనే ఆగిపోతుందా..? ఏపీకి కూడా వస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది. కొసమెరుపేమిటంటే.. ఈ హెలికాఫ్టర్.. తర్వాత అగ్రిప్రమాదంలో కాలిపోయింది.