అల్లు అర్జున్ తెలుగుదేశం పార్టీ తరపున ప్రచారం చేయబోతున్నారా..?. ఏపీ , తెలంగాణలో ఇప్పుడీ విషయం హాట్ టాపిక్ గా మారుతోంది.అయితే..అల్లు అర్జున్ ప్రచారం చేయబోయేది ఏపీలో మాత్రం కాదు. తెలంగాణలో . దానికి కూడా షరతులు వర్తిస్తాయి. కుటుంబం వైపు నుంచి ఉన్న అబ్లిగేషన్స్ ప్రకారం ఆయన టీడీపీ తరపున పోటీ చేస్తారనే వాదన బలంగా వినిపిస్తోంది. దాని వెనుక ఉన్న బ్యాక్ గ్రౌండ్ చాలా పెద్దదే. అల్లు అర్జున్ ప్రాణం పెట్టే జీవిత భాగస్వామి స్నేహరెడ్డి తండ్రి కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి. ఆయన రాజకీయ నాయకుడు. టీఆర్ఎస్ పార్టీలో.. రంగారెడ్డి జిల్లాలోని… ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుంచి.. గత ఎన్నికల్లో పోటీ చేశారు. ఈ సారి కూడా పోటీ చేయడానికి చాలా కాలంగా ఏర్పాట్లు చేసుకున్నారు. గత ఎన్నికల్లో ఆ స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మంచిరెడ్డి కిషన్ రెడ్డి గెలిచారు.
సిట్టింగులందరికీ టిక్కెట్లు స్ట్రాటజీలో భాగంగా… అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డికి కేసీఆర్ హ్యాండిచ్చారు. దీంతో ఆయన.. తన రాజకీయ భవిష్యత్ కోసం ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. ముందుగా కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకున్నారు. కానీ… మహాకూటమి ఏర్పడటంతో.. ఆ స్థానం ఎవరికి దక్కుతుందో చూసి ఆ పార్టీలో చేరాలనుకుంటున్నారు. గత ఎన్నికల్లో అక్కడ టీడీపీ అభ్యర్థి గెలిచారు కాబట్టి.. పంపకాల్లో భాగంగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం టీడీపీ ఖాతాలోకి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో.. ఇప్పటికే … టీడీపీ అధినేతతో టచ్ లోకి వెళ్లిన కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి.. పోటీకి ఏర్పాట్లు చేసుకున్నట్లు సమాచారం. టీడీపీ అధినేత వైపు నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందని చెబుతున్నారు. దీంతో మామ రంగంలోకి దిగితే.. అల్లు అర్జున్… ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో కచ్చితంగా ప్రచారం చేస్తారని కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి వర్గీయులు ప్రచారం చేస్తున్నారు. పార్టీ ఏదైనా… తన మామ రాజకీయ భవిష్యత్ కోసం .. తన వంతు సాయం చేయడానికి అల్లు అర్జున్ ఎప్పుడూ సిద్దంగా ఉంటారని చెబుతున్నారు.
ప్రస్తుతం ఊహాగానాల దశలోనే ఉన్న.. ఈ వ్యవహారంపై రెండు, మూడు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇబ్రహీంపట్నం టిక్కెట్… టీడీపీ అధినేత కంచర్ల చంద్రశేఖర్ రెడ్డికి కేటాయిస్తే మాత్రం… మెడలో టీడీపీ జెండాలో.. అల్లు అర్జున్ ప్రచారం చేయడాన్ని మనం చూడొచ్చు. అదే జరిగితే… రాజకీయంగా ఏపీలో పొలిటికల్ ఈక్వేషన్లు ఏపీలోనూ.. కాస్తం మార్పులు కనిపించే అవకాశం ఉంది. ఎందుకంటే… మెగా ఫ్యామిలీ నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్.. అక్కడ ఓ ప్రధాన పోటీదారుగా ఉన్నారు మరి….