అంబటి రాంబాబు మంత్రి పదవికి గండం వచ్చిందని వైసీపీలో విస్తృత ప్రచారం జరుగుతోంది. యూట్యూబ్ చానల్‌కు చెందిన ఓ మహిళా జర్నలిస్టు ఇంటర్యూ కావాలని ఆయనకు వాట్సాప్ మెసెజ్ పెడితే లైంగిక వేధింపులకు పాల్పడినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. ఈ అంశంపై ఇప్పటికే వైసీపీలో రకరకాలుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు కూడా ట్వీట్ చేశారు. అంబటి రాంబాబు ఓ మహిళా జర్నలిస్టును లైంగికంగా వేధించారని ఆయన ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించిన వివరాలు త్వరలో బయట ప్రపంచానికి తెలుస్తాయని అయ్యన్న ప్రకటించారు.
ఇవేమీ రహస్యం కాదని సీఎం సహా చేరాల్సిన వారి దగ్గరకు చేరాని త్వరలో అంబటి రాంబాబును మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయడం ఖాయమని ఆయన ట్వీట్ చేశారు. అయ్యన్నపాత్రుడు ట్వీట్‌తో ఇప్పటి వరకూ వైసీపీలో అంతర్గతంగా జరిగిన చర్చ బహిర్గతమయింది. అంబటి రాంబాబుపై అయ్యన్నపాత్రుడు చేసిన ఆరోపణలపై ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. దీనికి కారణం గతంలో అంబటి రాంబాబుపై ఈ తరహా ఆరోపణలు ఉండటమే.
గతంలో సంజనా అనే మహిళతో అసభ్యంగా మాట్లాడినట్లుగా ఆరోపణలు వచ్చాయి. టీవల సుకన్య అనే మహిళతో మాట్లాడినట్లుగా ఆడియో టేపులు బయటకు వచ్చాయి. అవి తనవి కాదని అంబటి రాంబాబు ప్రకటించారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. అధికార పార్టీ ఎమ్మెల్యే పేరుతో మార్ఫింగ్ ఆడియోలు రిలీజ్ చేసినా పోలీసులు సీరియస్‌గా తీసుకోకపోవడంతో అవి ఆయనవేనన్న అభిప్రాయం బలంగా ఏర్పడింది.