పోలింగ్ ముగిసింది. ఇప్పుడు గత ఆరు నెలలకు ఏపీ ప్రజలకు ఆపిన పథకాల డబ్బులను ఏపీ ప్రభుత్వం ప్రజల ఖాతాల్లో వేస్తుందా లేదా అన్నది సస్పెన్స్ గా మారింది. పోలింగ్ కు మందు హైకోర్టు నుంచి అనుమతి తెచ్చుకుని ఓటర్ల ఖాతాల్లో డబ్బులేస్తామని హడావుడి చేశారు. కావాల్సినంత డ్రామా నడిపారు కానీ డబ్బులు మాత్రం వేయలేదు. ఈసీ పోలింగ్ అయిపోయిన తర్వాత రోజు వేసుకోవచ్చని స్పష్టం చేసింది. అందుకే లబ్దిదారులు అంతా ఈ రోజు డబ్బులు వేస్తారేమోనని ఎదురు చూస్తున్నారు.
ప్రజలకు తమకు ఓట్లేయలేదని అనకుంటే మాత్రం వైసీపీ ప్రభుత్వ పెద్దలు లబ్దిదారులకు నగదు జమ చేసే అవకాశాలు ఉండవు. ఎలాగూ ఓడిపోతాం కాబట్టి ఖజానాను ఖాళీ చేసి అస్మదీయుల ఖాతాల్లోకి పంపిణీ చేయించుకున్నా ఆశ్చర్యం లేదన్న వాదన వినిపిస్తోంది. ఖాతాల్లో పధ్నాలుగు వేల కోట్లు ఉన్నా.. మరో నాలుగు వేల కోట్ల అప్పునకు ఆర్బీఐ వద్దకు వెళ్లారు. ఏపీ ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ మిస్టీరియస్ గా మారింది. అసలు వీరు చేసిన వ్యవహారాలపై లెక్కలన్నీ బయటకు రావాలంటే .. ప్రభుత్వం మారాల్సిందే.
ప్రజల ఖాతాల్లో పథకాల డబ్బులు వేయకపోతే మాత్రం.. వైసీపీకి మరింత గడ్డు పరిస్థితి ఎదురవుతుంది. గత ఎన్నికల సమయంలో చంద్రబాబు రుణమాఫీ చివరి రెండు విడతలు ఫైనల్ చేసి.. బడ్జెట్ రిలీజ్ చేసి.. నిధులు జమ చేయాల్సిన సమయంలో సీఎస్ ను బదిలీ చేయించారు. కొత్తగా వచ్చిన సీఎస్.. రుణమాఫీ నిధులు ఆపేశారు. చివరికి అవి ఇవ్వకుండా జగన్ ఎగ్గొట్టారు. ఈ సారి కూడా అలా ఎగ్గొడతారన్న అభిప్రాయం వినిపిస్తోంది.