ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పులు పుట్టడం లేదని విరాళాలు తీసుకోవాలనే ఆలోచన చేస్తోంది. అంతర్జాతీయంగా కూడా విరాళాలు సేకరించాలని నిర్ణయించుకుంది. ఎందుకంటే స్కూళ్లలో అదనపు తరగతి గదులు కట్టించాలని అనుకుంటోంది. నాడు – నేడు పేరుతో ఇప్పటి వరకూ కొన్ని స్కూళ్లలో కొత్త బల్లు.. బ్లాక్ బోర్డులు, పెయింటింగ్ లాంటి పనులు చేశారు. ఇప్పుడు అదనపు తరగతి గదులు అవసరం తెలిసిదంి.కానీ డబ్బుల్లేవు. అప్పులు పుట్టే పరిస్థితి లేదు.
అందుకే విరాళాలు తీసుకోవాలని నరి్ణయించింది. స్కూళ్లలో అదనపు తరగతి గదుల కోసం రూ.6321 కోట్లు అవసరమని గుర్తించి జాతీయ, అంతర్జాతీయ దాతృత్వ సంస్థల నుంచి విరాళాలుసేకరించాలని నిర్ణయించారు. విరాళాల విధివిధానాలు త్వరలోనే ప్రభుత్వ నుంచి ఉత్తర్వులు జారీ కానున్నాయి. దాతలు ఒక పాఠశాలకు లేదా కొన్ని పాఠశాలలకు కలిపి విరాళం ఇవ్వొచ్చు..విరాళం ఇచ్చినట్లు దాతలకు ఒక సర్టిఫికెట్ కూడా ఇచ్చే అవకాశం ఉంది.
అయితే ప్రభుత్వానికి అప్పులే ఇవ్వడం లేదు.. ఇక విరాళాలుగా వేల కోట్లు ఇస్తారా అన్నది మాత్రం కాస్త సస్పెన్స్‌గానే ఉంది. అయితే విదేశాల నుంచి విరాళాలు తీసుకునే విషయంలో కేంద్రం ఇటీవల అనేక ఆంక్షలు పెడుతోంది. ఈ కారణంగా ఈ ప్రయత్నమూ ఎంత సక్సెస్ అవుతుందో వేచి చూడాలి !