పూరి కెరీర్ ఇప్పుడు అగమ్య గోచరంగా తయారైంది. లైగర్ తరవాత సినిమా ఏమిటన్న విషయంలో ఇప్పటి వరకూ స్పష్టత లేదు. ముందు చిరు, బాలయ్య పేర్లు వినిపించాయి. ఆ తరవాత విశ్వక్ సేన్ అన్నారు. ఇప్పుడు మళ్లీ రామ్ అంటున్నారు. `ఇస్మార్ట్ శంకర్` సినిమాకి సీక్వెల్ గా `కాక` అనే ఓ సినిమా రాబోతోందని ప్రచారం జరిగింది. అయితే.. మళ్లీ పూరి సినిమా మొదటికి వచ్చింది. ఈసారి బాలయ్యతోనే ఫిక్స్ అన్నది తాజా ఖబర్. రామ్ కోసం అనుకొన్న `కాక` కథని.. బాలయ్య కోసం మార్చి తీస్తున్నారని బయట టాక్. రామ్ కథ… బాలయ్యకి ఎలా సెట్టవుతుంది? అనేది అర్థం కాని విషయం.
నిజంగానే బాలయ్య ఈ సినిమా ఓకే చేసినా, ఇప్పట్లో సెట్స్ పైకి వెళ్లే ఛాన్సులు చాలా తక్కువ ఉన్నాయి. ఎందుకంటే.. ప్రస్తుతం అనిల్ రావిపూడి సినిమాతో బాలయ్య బిజీ. ఆ వెంటనే బోయపాటి శ్రీను సినిమాని పట్టాలెక్కిస్తాడు. 2024 ఎన్నికలకు కలిసి వచ్చేలా బోయపాటి సినిమా ఉండబోతోందని టాక్. అందుకే ఎట్టిపరిస్థితుల్లోనూ బోయపాటి సినిమా మిస్ అవ్వదు. అంటే.. పూరి – బాలయ్య కాంబో కుదరాలంటే.. కనీసం యేడాదైనా ఆగాలి. అప్పటికే పూరి సినిమా ఆలస్యమైంది. పూరి ఎవరి కోసమూ ఆగే టైపు కాదు. సో… బాలయ్య కోసం కూడా పూరి ఆగే ప్రసక్తి లేదు. మరి.. పూరి మైండ్ లో ఏముందో చూడాలి.