టీడీపీ ర్యాలీలపై దాడులు చేయడం… ప్రతిఘటిస్తే వెంటనే టీడీపీ ముఖ్య నేతలపై హత్యాయత్నం కేసులు నమోదు చేయడం అనే కుట్రలు పీక్స్‌కు చేరుకున్నట్లుగా కనిపిస్తోంది. ఒకటి, రెండు రోజుల్లో చంద్రబాబును అంగళ్లు హత్యాయత్నం కేసులో అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా సమాచారం లీక్ అయింది. టీడీపీ అధినేత చంద్రబాబు అనంతపురం జిల్లాలో ఇదే చెప్పారు. అంగళ్లులో తనపై హత్యాయత్నం చేసింది కాక…తనపై కేసులు పెట్టారని.. రెండు , మూడు రోజుల్లో అరెస్ట్ చేసే అవకాశం ఉందని చెప్పారు.
అంగళ్లు ఘటన జరిగిన నాలుగు రోజుల తర్వాత చంద్రబాబుపై ఏ వన్ గా పెట్టి కేసు పెట్టారు. మిగతా నేతలు హైకోర్టుకు వెళ్లి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. వారి బెయిల్ రద్దు చేయాలని ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. ఇంకా విచారణకు రాలేదు. అయితే ఈ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ కోసం కోర్టుకు వెళ్లలేదు. ఈ కారణంతో అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నరని అంటున్నారు.
జగన్ రెడ్డి లక్ష్యం చంద్రబాబును అరెస్ట్ చేసి ఒక్క రోజైనా జైల్లో ఉంచాలని. నాలుగున్నరేళ్లుగా ఆయన చేస్తున్న ప్రయత్నాలన్నీ విఫలమవుతున్నాయి. ఇప్పుడు అంగళ్లు కేసులో ఆయనపై దాడి చేసి ఆయనపైనే హత్యాయత్నం కేసు ద్వారా దాన్ని నెరవేర్చుకోవాలనుకుంటున్నారు. తన ప్రమేయం లేదని చెప్పుకోవడానికి.. ఆయన లండన్ వెళ్లి అక్కడ్నుంచి చంద్రబాబు అరెస్ట్ ను లైవ్ లో చూస్తారని.. వైసీపీ వర్గాలు చెప్పుకుంటున్నాయి.
అయితే చంద్రబాబును ఇలాంటి కేసుల్లో అరెస్ట్ చేసి ఈగోను శాటిస్ ఫై చేసుకుంటారు కానీ.. తర్వాత రాజకీయ పరిణామాలు ఇబ్బందికరంగా మారుతాయని ఓ వర్గం వైసీపీ నేతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.