మంగళగిరి నుంచి 2014లో టీడీపీ తరపున పోటీ చేసి 12 ఓట్లు తేడాతో ఆర్కేపై ఓడిపోయిన గంజి చిరంజీవి వైసీపీలో చేరారు. కొంత కాలంగా మంగళగిరిలో బీసీ అభ్యర్థికే టిక్కెట్ అని ఆళ్లను మారుస్తున్నారని ప్రచారం చేశారు. సత్తెనపల్లి టిక్కెట్‌ను ఆళ్లకు ఇస్తారని చెప్పుకున్నారు. ఈ ప్రచారాన్ని చూపించి గంజి చిరంజీవికి టిక్కెట్ ఆఫర్ ఇచ్చారు వైసీపీ నేతలు, పార్టీలో చేరితే లోకేష్‌పై పోటీ చేసే చాన్స్ ఇస్తామన్నారు. ఆర్థిక సాయం కూడా చూసుకుంటామన్నారు. లోకేష్‌ను ఓడించేందుకు జగన్ ఎంత పట్టుదలగా ఉన్నారో తెలుసు కాబట్టి… మీకు భారం ఏమీ ఉండదని.. మొత్తం పార్టీ చూసుకుంటుందని చెప్పి కండువా కప్పేశారు.
ఆయనకు కండువా కప్పే వరకూ.. అభ్యర్థి ఆయనేనని చెప్పుకున్నారు. వైసీపీలోనూ అదే జరిగింది. చివరికి ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా మాట్లాడలేదు. కానీ ఒక్క సారిగా తాడేపల్లి క్యాంప్ ఆఫీస్‌లో.. జగన్‌తో కండువా కప్పించుకుని బయటకు వచ్చిన తర్వాత సీన్ మారిపోయింది. స్వయంగా దగ్గరుండి గంజి చిరంజీవికి కండువా కప్పించి తెప్పించిన ఆళ్ల రామకృష్ణారెడ్డి మీడియా ముందు మాత్రం తానే అభ్యర్థినని ప్రకటించేసుకున్నారు. ఎంత మంది చేరినా తానే మంగళగిరిలో పోటీ చేస్తానని లోకేష్‌ను ఓడిస్తానని చెప్పుకున్నారు.
దీంతో గంజి చిరంజీవికి షాక్ తగిలినట్లయింది. రెడ్డి సామాజికవర్గం ఆడిన పొలిటికల్ గేమ్‌లో తాను పావునయ్యాయన్న ఫీలింగ్‌కు వచ్చారు. అయితే తాను ఇక దూకేశానని.. తనను జగన్ మోసం చేయరని అనుకుంటున్నారు. కానీ మంగళగిరిలో గంజి చిరంజీవి నాయకత్వాన్ని ఎవరూ అంగీకరించడం లేదు. ఇప్పటి వరకూ టీడీపీలో ఉండేది.. ఇప్పుడు తమపై పెత్తనం చేస్తారా అని వారు మండి పడుతున్నారు.