జగన్ పాలనలో వైసీపీ నాయకులు బరి తెగించారు. నోటికి అడ్డు అదుపులేకుండా పిచ్చి వాగుడు వాగారు. ప్రజలకు మంచి చేయాలని ఎన్నుకుంటే జగన్ మెప్పు కోసం ప్రతిపక్ష నాయకులని అసభ్య పదజాలంతో తిడుతూ రాక్షసానందం పొందారు. అయితే కాలం ఎప్పుడూ ఒకేలా వుండదు. అధికారంతో విర్రవీగిన వైసీపీని ప్రజలు కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చిత్తుగా ఓడించారు. అధికారంతో కళ్ళునెత్తినెక్కి మాట్లాడిన నాయకులకు ఇప్పుడు స్వయంగా ప్రజలే తగిన గుణపాఠం చెబుతున్నారు. గతంలో కారుకూతలు కూసిన నాయకులపై వరుసగా కేసులు నమోదౌతున్నాయి. ఇటివలే పోసాని కృష్ణమురళి పై కేసు నమోదు కావడం, ప్రస్తుతం ఆయన రిమైండ్ లో వున్న సంగతి తెలిసిందే.
తాజాగా వైసిపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కేసు నమోదైయింది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై గతంలో దువ్వాడ చేసిన అనుచిత వ్యాఖ్యలుపై అడపా మాణిక్యాలరావు గుంటూరులోపోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు దువ్వాడపై కేసు నమోదు చేశారు. గతంలో పవన్ కళ్యాణ్ పై తీవ్ర పదజాలంతో విరుచుపడ్డారు దువ్వాడ. పవన్ కళ్యాణ్ ని ఎంత తిడితే పార్టీలో అంత మైలేజ్ అనే ధోరణిలో అనరాని మాటలు అన్నారు. అయితే జగన్ అండ చూసి రెచ్చిపోయిన నాయకులు ఇప్పుడు పర్యవసనాలు ఎదుర్కోవాల్సింది వస్తోంది. కూటమి ప్రభుత్వం ఇలా బరి తెగించి మాట్లాడిన నాయకుల పట్ల కఠిన చర్యలు చేపడుతోంది. ఇప్పుడు దువ్వాడ పై నమోదైన కేసులో కూడా సీరియస్ నెస్ వుంది. ఆయన్ని విచారణకు పిలిచి, అవసరమైతే అరెస్ట్ చేసే అవకాశం కూడా వుంది. ఇలాంటి బూతురాయుళ్ళు విషయంలో కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల పట్ల ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇలా పటిష్టమైన చర్యలు చేపట్టడం ద్వారానే సంస్కరవంతమైన రాజకీయాలు సాధ్యపడతాయనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.