ఏపీలో రాజ్యాంగ ఉల్లంఘన జరిగిన విషయం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రభుత్వం జారీ చేసిన జీవో ఒక్క చంద్రబాబుకే అమలు చేస్తుస్తున్నారు. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో ఆయనను పర్యటించకుండా వేల మంది పోలీసులతో అడ్డుకున్న ప్రభుత్వం అదే సమయంలో… తమ పార్టీ నేతలు ర్యాలీలు నిర్వహిస్తూ… రోడ్లపై హంగామా చేస్తున్నారు. వీటిని సాక్షి మీడియాలో గొప్పగా ప్రచారం చేసుకుంటున్నారు. ఇదేంది అంటే.. జీవోలో ర్యాలీలు నిర్వహించుకోకూడదని ఎక్కడా లేదని సజ్జల సెలవిచ్చారు.
అడ్డగోలు చట్టాలు తేవడం.. అందులో ఉన్న అంశాలపై తమకు ఇష్టం వచ్చిన రీతిలో అన్వయం చేసుకోవడం ప్రభుత్వానికి.. అధికార పార్టీకే చెల్లింది. ఓ వైపు ప్రతిపక్ష నాయకుడికి కుప్పంలో మాట్లాడే అవకాశం ఇవ్వలేదు కానీ ఆ జీవోను ఉల్లంఘించి అదే పనిగా అధికార పార్టీ నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఏపీలో రాజ్యాంగ ఉల్లంఘనకు ఇది పక్కా సాక్ష్యంలా కనిపిస్తోంది. ప్రజాస్వామ్యాన్ని ఇంత దారుణంగా వంచిస్తున్న ప్రభుతవం మరొకటి ఉండదు.
ఏపీ ప్రభుత్వం ప్రతిపక్ష నాయకుడ్ని ప్రజల్లోకి వెళ్లకుండా కట్టడి చేయడానికి .. అదే సమయంలో తాము జోరుగా తమ బల ప్రదర్శన చేయడానికి ప్రభుత్వం ఎంతకైనా దిగజారిపోతోందని అర్థమైపోతోంది. ప్రతిపక్ష నేతను .. ప్రజల్లోకి వెళ్లకుండా నియంత్రించడం ద్వారా ప్రజల్లో వ్యతిరేకత మూటగట్టుకోవడం కన్నా సాధించేమీ ఉండదు. కానీ కనీసం వెరపు లేకుండా తాము చేయాలనుకున్నది చేస్తూ.. ఇతరులు తప్పు చేస్తున్నట్లుగా కేసులు పెట్టడమే విచిత్రం.