విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా.. వీళ్లు లేని ఇండియన్ టీమ్‌ని ప్రస్తుతానికి ఊహించం కష్టం. అయితే… ఈ ముగ్గుర్నీ టీమ్ నుంచి బయటకు పంపించే టార్గెట్ తో వస్తున్నాడు గౌతమ్ గంభీర్.
భారత జట్టుకు ఇప్పుడు కొత్త కోచ్ కావాలి. ప్రస్తుతం కోచ్‌గా పని చేస్తున్న రాహుల్ ద్రావిడ్ పదవీకాలం పూర్తవుతున్న నేపథ్యంలో కొత్త కోచ్ కోసం బీసీసీఐ ఎప్పటి నుంచో అన్వేషిస్తోంది. ఈ రేసులో గౌతమ్ గంభీర్ ముందు వరుసలో ఉన్నాడు. గంభీర్‌ను కోచ్‌గా నియమించడంలో బీసీసీఐకి ఎలాంటి అభ్యంతరం లేదు. గంభీర్ కూడా `నేను రెడీ` అనే సంకేతాలు పంపాడు. కాకపోతే… కొన్ని కండీషన్లు పెట్టాడు. ఏ కోచ్ అయినా బాధ్యతలు చేపట్టేటప్పుడు తనవైన కొన్ని షరతులు విధిస్తాడు. గంభీర్ కూడా అదే చేశాడు. కాకపోతే.. అందులో ఓ కండీషన్ మాత్రం కోహ్లీ, రోహిత్, జడేలా లాంటి సీరియర్ల చోటుకు ఎసరు పెట్టేలా ఉంది.
ఒకవేళ గంభీర్ గనుక కోచ్ అయితే, వచ్చే వరల్డ్ కప్ వరకూ ఈ పదవిలో కొనసాగుతాడు. వచ్చే యేడాది పాకిస్థాన్‌లో ఛాంపియన్స్ ట్రోఫీ జరగబోతోంది. అందులో జట్టు ఆటతీరును బట్టి వరల్డ్ కప్ స్క్వాడ్‌ను ఇప్పటి నుంచే ప్రిపేర్ చేయాలన్నది గంభీర్ షరతు. ఛాంపియన్స్ ట్రోఫీలో సీరియర్లు కోహ్లి, రోహిత్ శర్మ, జడేజా, షమీలాంటి వాళ్లు విఫలం అయితే, వాళ్లని జట్టు నుంచి తొలగించడానికి ఎలాంటి ఆటంకాలూ ఉండకూడదని, ఆ పరిస్థితుల్లో ఎవరూ తనకు అడ్డు చెప్పకూడదని గంభీర్ కండీషన్ విధించాడట. దాంతో బీసీసీఐ కాస్త కలవరపాటుకు గురవుతోంది.
గంభీర్ – కోహ్లీ మధ్య ఎలాంటి వైరం ఉందో అందరికీ తెలిసిందే. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి పడదు. కోచ్‌గా గంభీర్ వస్తే, కోహ్లీ రియాక్షన్ ఏమిటన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఒకవేళ కోహ్లీ లాంటి ప్లేయర్ ఖర్మకాలి ఛాంపియన్ ట్రోఫీలో విఫలం అయితే, తనకు ఇక రిటైర్మెంట్ తప్పదు. వచ్చే వరల్డ్ కప్‌లోనూ ఆడాలని రోహిత్, షమీ, జడేజాలాంటి వాళ్లు కలలు కంటున్నారు. అయితే గంభీర్ మాత్రం సీరియర్లని పక్కన పెట్టి, యువ జట్టుని తయారు చేయాలని చూస్తున్నాడు. అక్కడే బీసీసీఐ కాస్త కంగారు పడుతోంది. ఈ షరతుకు గనుక ఒప్పుకొంటే గంభీర్ కోచ్ అయినట్టే. కానీ… ఈ సీరియర్ల భవితవ్యమే ప్రశ్నార్థకంగా మారుతుంది.