పంచాయతీ ఎన్నికలు కొనసాగించాలని హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇవ్వడంతో ఇప్పుడు అందరి దృష్టి ప్రభుత్వం, ఉద్యోగులపై పడింది. ప్రభుత్వం మొదటి నుంచి వ్యతిరేకతతోనే ఉంది. అయితే ప్రజాధనం జీతంగా తీసుకుంటున్న ఉద్యోగులు… తమ విధుల్ని తాము నిర్వహించబోమని.. అనడమే కాదు.. ఎస్ఈసీపై దూషణలకు కూడా పాల్పడ్డారు. ఉద్యోగ సంఘ నేతలు ఈ మేరకు గవర్నర్‌కు కూడా ఫిర్యాదు చేశారు. తాము ఎన్నికల నిర్వహణలో పాల్గొనబోమని ప్రకటించారు. బహిష్కరిస్తున్నామన్నారు. అయితే వీరితో ప్రభుత్వపెద్దలే ఇలా చెప్పించాలన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ పెద్దలు చెప్పినా.. ఎవరు చెప్పినా… ఉద్యోగుల వ్యతిరేకత అనేది తేలిపోయింది. చివరికి ఎస్ఈసీలో పని చేయడానికి కూడా ఉద్యోగులు సిద్ధమవలేదు. దీంతో ఇప్పుడు హైకోర్టు తీర్పు ప్రకారం ఎన్నికల నిర్వహణ ఎలా అనేది పెద్ద సస్పెన్స్‌గా మారింది.
ఉద్యోగ సంఘాలు.. ఆరు నూరైనా తాము సహకరించబోమని చెబుతున్నాయి. ఇందులో పోలీస్ అధికారుల సంఘం కూడా ఉంది. ఇప్పుడు హైకోర్టు తీర్పు వచ్చింది. హైకోర్టు తీర్పును గౌరవించి తాము ఎన్నికల నిర్వహణలో పాల్గొంటామని అంటారో లేకపోతే… బహిష్కరిస్తమని ప్రకటిస్తారో అన్న ఆసక్తి వ్యక్తమవుతోంది. ప్రస్తుతానికి ఏంమ చేయాలన్న దానిపై ప్రభుత్వం సైలెంట్ మోడ్‌లో ఉంది. వ్యూహాత్మకంగా చర్చలు జరుపుతోంది. హైకోర్టు తీర్పును గౌరవించాలా లేక పోతే మొండిగా.. ప్రభుత్వానికి ఇష్టం లేదు కాబట్టి ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదన్న వాదనకే కట్టుబడి ఉండాలా అన్నదానిపై చర్చలు జరుగుతున్నాయి.
ప్రభుత్వం ఎదురుదాడికే సిద్ధమయితే… ఉద్యోగ సంఘాల కు సమాచారం వెళ్తుంది. దాంతో వారు మీడియా ముందుకు వచ్చి.. ఎన్నికల నిర్వహణకుతాము సహకరించే ప్రసక్తే లేదని.. బహిష్కరిస్తున్నామని ప్రకటించే అవకాశం ఉంది. అప్పుడు ఎస్ఈసీనే కీలకమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. కేంద్ర బలగాలను పిలిపించి… మొత్తం ఆన్ లైన్ చేసి ఎన్నికలు నిర్వహించినా ఆశ్చర్యం లేదంటున్నారు. మొత్తానికి ఇప్పుడు బాల్ ప్రభుత్వం చేతుల్లో పడింది.. ప్రభుత్వం ఏం చేస్తుందన్నది ఆసక్తి కరంగా మారింది. ఒకటి రెండు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.