బీఆర్ఎస్ పార్టీలో మంచి టైమింగ్ ఉన్న నేత హరీష్ రావు. క్రౌడ్ పుల్లర్ కూడా… హరీష్ రావు పార్టీలో ఎప్పటికప్పుడు తన ప్రభావం తగ్గకుండా చూసుకోవటంలో పర్ఫెక్ట్. ఇదే విషయం మరోసారి అవకాశం కల్పించుకొని మరీ చూపించారు.
కౌశిక్ రెడ్డి ఎపిసోడ్ అంతా అరికెపూడి గాంధీ అరెస్ట్ తో క్లోజ్ అనుకున్నారు అంతా. కానీ కౌశిక్ రెడ్డి దూకుడుకు, హరీష్ రావు టైమింగ్ తోడయ్యింది. హుటాహుటిన సిద్ధిపేట నుండి బయల్దేరటం, తాను వచ్చే సరికి సిటీ ఎమ్మెల్యేలంతా వచ్చేలా కోఆర్డినేట్ చేసుకోవటం, కమిషనర్ వద్దకు వెళ్లటం… అక్కడ గొడవ, అరెస్ట్… 10వేల మంది రావాలి అంటూ పిలుపునివ్వటం అంతా హరీష్ రావు టైమింగ్ కు నిదర్శనం.
నిజానికి కేసీఆర్ సైలెంట్ గా ఉంటే వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో కేటీఆర్ పార్టీని నడిపిస్తున్నారు. ఇతరత్రా ఏం ఉన్నా హరీష్ రావుతో పాటు పార్టీ మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డిని తెరపైకి తెస్తుంది. కానీ, కేటీఆర్ అమెరికాలో ఉన్న సమయంలో అందివచ్చిన అవకాశాన్ని హరీష్ రావు పక్కగా వాడుకున్నారు. తన సోషల్ మీడియా టీం కూడా యాక్టివ్ గా పనిచేసింది. అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించటం, భుజం గాయం, అక్కడ బీఆర్ఎస్ కార్యకర్తలతో హడావిడి… బయటకు వచ్చాక ఎలివేషన్లు చూస్తే… కేసీఆర్ సైలెన్స్ లో, కేటీఆర్ లేని సమయంలో ఉన్న గ్యాప్ ను హరీష్ రావు పక్కాగా వాడుకున్నారన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తం అవుతోంది.
ట్రబుల్ షూటర్ గా ఎంత పేరున్న అధికారంలో ఉన్న సమయంలో హరీష్ రావుకు పూర్తిస్థాయి ఎలివేషన్ రాలేదు. మొన్న వరదల సమయంలో హరీష్ రావు ఒక్కరే ఖమ్మం పర్యటన చేపట్టినా ఫెయిల్ అయ్యారు. కానీ ఇప్పుడు మాత్రం ఉద్యమ పార్టీకి పాత రోజులను గుర్తు చేయటంతో పాటు పార్టీలో తన కీ రోల్ ను హరీష్ రావు గుర్తు చేశారంటున్నారు విశ్లేషకులు.