జమిలీ ఎన్నికలు నిర్వహించాలంటే ఆరు రాజ్యాంగసవరణలు చేయాలని తాజగా నిపుణులు తేల్చారు. అవేమిటి అన్న సంగతి పక్కన పెడితే… అలా చేయాలంటే మూడింట రెండు వంతుల మెజార్టీ అవసరం, ఉభయ సభల్లోనూ ఆ మెజార్టీ అవసరం. కానీ రెండు సభల్లోనూ బీజేపీకి కూటమికి.. సాధారణ మెజార్టీనే ఉంది. మరి ఎలా రాజ్యాంగసవరణలు చేస్తారు ?.
నిజానికి జమిలీ ఎన్నికలకు ఏకాభిప్రాయం లేదు కానీ.. మెజార్టీ అభిప్రాయాలు అనుకూలంగానే ఉన్నాయి. కాంగ్రెస్, మజ్లిస్ మాత్రమే … కోవింద్ కమిటీకి కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసిన తరవాత వ్యతిరేక ప్రకటనలు చేశాయి. అంతకు ముందే లా కమిషన్ కు కూడా తమ అనుకూలతను చాలా పార్టీలు తెలియచేశయి. ముఖ్యంగా శరద్ పవార్, అఖిలేష్ యాదవ్ జమిలీ ఎన్నికలను సమర్థించారు. నితీష్ కుమార్, నవీన్ ప ట్నాయక్, కేసీఆర్ , జగన్మోహన్ రెడ్డి కూడా గతంలో అనుకూలంగా ప్రకటన చేశారు. కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించినా ఉభయసభల్లో మూడింట రెండు వంతుల మెజార్టీకి పెద్ద సమస్య రాదు.
అసెంబ్లీల్లో యాభై శాతం అంటే సాధారణ మెజార్టీలతో బిల్లును అడాప్ట్ చేసుకుంటే చాలు. అన్ని రాష్ట్రాల్లోనూ అవసరం లేదు. మెార్టీ రాష్ట్రాల్లో చేసుకుంటే చాలు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నది మూడు రాష్ట్రాల్లోనే. ఇరవై రాష్ట్రాల్లో సులువుగా జమిలీ ఎన్నికలకు మద్దతుగా బిల్ పాస్ చేస్తారు. ఈ ధైర్యంతోనే … ఖచ్చితంగా జమిలీ ఖాయమని .. కేంద్ర పెద్దలు పదే పదే ప్రకటనలు చేస్తున్నారని అనుకోవచ్చు.