టీమ్ ఇండియా విజయ లక్ష్యం 230 పరుగులు.
ఈ లక్ష్యాన్ని నిర్దేశించిన జట్టు ..ఆసీస్, ఇంగ్లాండ్, పాకిస్తాన్ కాదు.. పసికూన నేపాల్.
ఆసియా కప్ లో టీమిండియా బౌలింగ్ డొల్లతనం చాటిన మ్యాచ్ ఇది. అంతర్జాతీయ వేదికపై నేపాల్ లాంటి జట్టుని 49 ఓవర్స్ వరకూ కట్టడి చేయలేకపోయిన టీమ్ ఇండియా బౌలర్లు.. ఫ్యాన్స్ ని ఒక్కసారిగా ఆలోచనల్లో పడేశారు. ఈ బౌలింగ్ తో ప్రపంచకప్ ని గెలుస్తారా ? అనే అనుమానాలు రేకెత్తించారు.
నేపాల్ తో మ్యాచ్ పై ఎవరికీ అంచనాలు లేవు. ఐతే ఈ మ్యాచ్ చూసిన తర్వాత టీమ్ ఇండియా ఆట తీరుపై కలవరం మొదలైయింది. వరల్డ్ కప్ కి ముందు జరుగుతున్న ఈ సిరిస్ లో పాక్ తో జరిగిన మ్యాచ్ లో భారత బ్యాట్స్ మెన్స్ ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చారు. ఇషాన్ కిషన్, హార్దిక పాండ్య అదుకోకపోయింటే..టీమ్ ఇండియా పరిస్థితి ఊహించడానికే కష్టం. వర్షం కారణంగా ఆ మ్యాచ్ లో టీమ్ ఇండియా బౌలింగ్ చూసే అవకాశం రాలేదు.
అయితే నేపాల్ తో జరిగిన మ్యాచ్ లో మన బౌలర్లు షాక్ ఇచ్చారు. పసికూన లాంటి జట్టుకు ఏకంగా 230 పరుగులు సమర్పించుకున్నారు. అటు ఫీల్డింగ్ లో కూడా చాలా తప్పిదాలు కనిపించాయి. విరాట్ శ్రేయాస్ లాంటి మేటి ఫీల్డర్స్ కూడా క్యాచులు వదిలేశారు. టీమిండియా బౌలర్స్ ని నిలువరించి సింగిల్స్, డబుల్స్, బౌండరీలు బాదుతూ స్కోర్ ని రెండు వందలకు పైగా దాటించారు నేపాల్ బ్యాటర్లు. టీమిండియా బౌలింగ్ చూసి విస్తుపోవడం ఫ్యాన్స్ వంతైయింది. బ్యాటింగ్ లో ఓపెనర్స్ రోహిత్, గిల్.. వికెట్ పడకుండా 145 (DLS) లక్ష్యాన్ని చేధించినప్పటికీ.. టీమిండియా బౌలింగ్ తీరు కలవరపెట్టింది.