దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణది విభిన్న శైలి. సగటు కమర్షియల్ అంశాలకు దూరంగా, కామెడీతో కూడిన ప్రేమకథలు, ఫ్యామిలీ ఎమోషన్స్‌తో కూడిన రొమాంటిక్ ఎంటర్టైనర్ సినిమాలు తీస్తూ వస్తున్నారు. హీరో మార్కెట్ కంటే ఎక్కువ ఖర్చు పెడతారని ఆయనపై ఓ విమర్శ. తాజాగా ఈయన దర్శకత్వం వహించిన సినిమా ‘సమ్మోహనం’. సుధీర్ బాబు, అదితీరావు హైదరి జంటగా నటించిన ఈ సినిమాను శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించారు. ఈ సినిమాకీ బడ్జెట్ ఎక్కువైంది. నిర్మాత ఆ సంగతి ఒప్పుకున్నారు. ‘జెంటిల్మన్’ తరవాత ఆయన నిర్మించిన సినిమా ఇది. రెండిటికీ దర్శకుడు ఒక్కరే. “ఇంద్రగంటి ముందుగా బడ్జెట్ ఎక్కువ అవుతుందని చెప్పాడు. ఇప్పటివరకూ ప్రొడక్షన్లో కాంప్రమైజ్ కాకుండా సినిమాలు నిర్మించా. ఈ సినిమాకీ కాంప్రమైజ్ కాలేదు” అని శివలెంక కృష్ణప్రసాద్ వ్యాఖ్యానించారు. ఈ నెల 15న సినిమా విడుదల కానుంది. నిర్మాత పెట్టుబడి రికవరీ అవుతుందా? లేదా? అనేది ఆ తరవాత తెలుస్తుంది. అయితే.. నిర్మాత మాత్రం ఇంద్రగంటి ప్రతిభ గురించి గొప్పగా చెబుతున్నారు. అతనితో పక్కా కమర్షియల్ సినిమా తీయాలనుందనీ, అతను తీయగలడనీ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.
ఇంద్రగంటితో మీడియం బడ్జెట్ సినిమాలు తీస్తే… మార్కెట్ చేయడం కష్టంగా మారింది. హీరో మార్కెట్ కంటే ఓవర్ బడ్జెట్ అవుతోంది. ఇక, కమర్షియల్ సినిమా అంటే.. వర్కవుట్ అవుతుందా? వర్కవుట్ అయ్యే పనేనా? నిర్మాత ముందడుగు వేశారు కాబట్టి… హీరోలు వేయడానికి సమస్య లేదు. ఇంద్రగంటి కమర్షియల్ కథతో ఏ హీరోని కన్వీన్స్ చేస్తాడో… వెయిట్ అండ్ సీ!!