ఐపీఎల్‌ హైదరాబాద్‌కొస్తుందా..!?

హైదరాబాద్‌లో ఐపీఎల్ మ్యాచ్‌లు పెట్టాలని కేటీఆర్ నేరుగా బీసీసీఐనే కోరారు. కానీ బీసీసీఐ పట్టించుకోలేదు. ఎంపిక చేసిన ఆరు వేదికల్లో హైదరాబాద్‌ను చేర్చలేదు. అయితే ఇప్పుడు బీసీసీఐనే బతిమాలి  హైదరాబాద్‌లో ఐపీఎల్ పెట్టాల్సిన పరిస్థితి వస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఐపీఎల్ ప్రారంభోత్సవం జరగాల్సిన ముంబై వాంఖడే స్టేడియం సిబ్బందిలో పలువురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వారంతా ఐసోలేషన్‌లో ఉన్నారు. పధ్నాలుగో తేదీన ప్రారంభోత్సవ కార్యక్రమం జరగాల్సి ఉంది. ఓ వైపు వాంఖడే టెన్షన్ ఉండగా.. మరో వైపు మహారాష్ట్రలో కరోనా విజృంభిస్తోంది. అక్కడ లాక్ డౌన్‌పై… నేడో రేపో నిర్ణయం తీసుకుంటామన్నట్లుగా ప్రభుత్వం ప్రకటనలు చేస్తోంది.

దేశంలో నమోదవుతున్న కరోనా కేసుల్లో సగానికిపైగా మహారాష్ట్రలోనే నమోదవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ముంబైలో ఐపీఎల్ పెట్టడం సాధ్యమేనా అన్న చర్చ జరుగుతోంది. ఇప్పుడు ప్రత్యామ్నాయంగా అందరి చూపు హైదరాబాద్‌పై పడింది. హైదరాబాద్‌లో ఐపీఎల్ నిర్వహించడానికి అవసరమైన మౌలిక సదుపాయాలన్నీ ఉన్నాయి. ఆటగాళ్లందరికీ సరిపడా ఆతిధ్యం ఇవ్వడానికి హోటళ్లుఉన్నాయి. అంతర్జాతీయ స్టేడియం ఉంది. సహకరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అన్నింటి కంటే ఎక్కువగా… కరోనా తీవ్రత మరీ ఎక్కువగా ఏమీ లేదు. దీంతో హైదరాబాద్ విషయంలో బీసీసీఐ పెద్దల్లో ఆలోచన ప్రారంభమైనట్లుగా కనిపిస్తోంది.

అయితే కరోనా సెకండ్ వేవ్ ప్రభావం… ఈ సారి కాస్త ఎక్కువగానే ఉంది. ఐపీఎల్ లో పాల్గొంటున్న ఆటగాళ్లకు వైరస్ సోకుతోంది. ఢిల్లీ ఆటగాడు అక్షర్ పటేల్‌కు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. చెన్నై ఆటగాడు ఒకరికి కూడా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ముందు ముందు ఇంకెంత మందికి పాజిటివ్‌ వస్తుందో తెలియని పరిస్థితి. ఈ తరుణంలో ఐపీఎల్ ప్రారంభమయ్యే వరకూ నిర్వహణ డౌటే అన్నట్లుగా పరిస్థితి మారుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డి-ఏజింగ్… లాభమా? నష్టమా ?

సినిమాలో ఒక క్యారెక్టర్ బాల్యం, యవ్వనం, కౌమార, ప్రౌడ దశలని చూపించడం ఫిల్మ్ మేకర్స్ కి పెద్ద సవాల్. ఇందుకోసం హలీవుడ్ నుంచి కూడా మేకప్ మ్యాన్ లని దిగుమతి చేసుకునే వారు....

దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లో దివ్వెల మాధురీ !

దువ్వాడ ఫ్యామిలీ డ్రామాలో కొత్త కొత్త ఎపిసోడ్లు ప్రారంభమవుతున్నాయి. కొద్ది రోజుల పాటు సైలెంట్ గా ఉంటానని చెప్పిన దివ్వెల మాధురీ.. ఒక్క సారిగా.. ఏకంగా దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లోనే ప్రత్యక్షమయ్యారు. దువ్వాడ...

ఆ పడవలు నందిగం సురేష్ తాలూకానే !

ప్రకాశం బ్యారేజీకి వరద వస్తే ఈ మధ్య బోట్లు కొట్టుకు వస్తున్నాయి. బ్యారేజని డ్యామేజ్ చేస్తున్నాయి. అవి ఎలా వస్తున్నాయో తెలియడం లేదు. ఇప్పుడు మిస్టరీ బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైసీపీ రంగులేసిన...

శభాష్ నిమ్మల… అభినందించిన నారా లోకేష్

భారీ వర్షానికి తోడు బుడమేరకు పడిన గండ్లు విజయవాడను ముంచేత్తాయి. కనీవినీ ఎరుగని స్థాయిలో వరద పోటెత్తడంతో విజయవాడ గత ఆరు రోజులుగా వరదలో నానుతోంది. బుడమేరుకు పడిన గండ్లు పూడ్చితేనే విజయవాడకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close