ఢిల్లీలో కొత్తగా నిర్మిస్తున్న పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలన్న డిమాండ్ తెలంగాణలో ఎక్కువగా వినిపిచింది. వెంటనే కేసీఆర్ అసెంబ్లీలో తీర్మానం చేశారు. తీర్మానంతో సరి పెట్టుకోలేదు.. తాను నిర్మిస్తున్న కొత్త సచివాలయానికి అంబేద్కర్ పేరు పెడుతూ జీవో ఇచ్చారు. బీజేపీ కూడా అలాగే చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పుడు ఈ పేరు డిమాండ్.. ఏపీ నుంచి కూడా వినిపించడం ప్రారంభమైంది. కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షుడు శైలజానాథ్.. జగన్ కూడా కేసీఆర్‌లా అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్‌కు అంబేద్కర్ పేరు పెట్టాలని తీర్మానం చేసి కేంద్రానికి పంపాలన్నారు.
అయితే ఈ అంశంపై వైసీపీ గుంభనంగా వ్యవహరిస్తోంది. బీజేపీకి కోపం వచ్చే పని చేయడం కష్టం. ఆ పార్టీకి కోపం రాదు అని.. తమ రాజకీయ ప్రయోజనాల కోసం తీర్మానం చేస్తామని చెప్పి ఒప్పించిన తర్వాత ఇక్కడ చేసే అవకాశం ఉంది. అయితే ఇలాంటి తీర్మానాల వల్ల భావోద్వేగాలు పెరుగుతాయని.. బీజేపీ భావిస్తే మాత్రం . అంగీకరించదు. అలా అంగీకరించకపోతే.. వైసీపీ అధినేత సైలెంట్‌గా వెళ్లిపోతారు. అందులో సందేహం లేదు. కానీ ఆయన ఇటీవల కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టి.. తమ పార్టీ వాళ్లతో చేయించిన రాజకీయం మాత్రం ఈ సందర్భంగా మరోసారి హాట్ టాపిక్ అయ్యే అవకాశం ఉంది.
రాజ్యాంగ నిర్మాత పేరును ఓ జిల్లాకు పెట్టడమే గొప్ప అన్నట్లుగా చెప్పిన వైసీపీ సర్కార్.. ఇప్పుడు ఢిల్లీలో నిర్మిస్తున్న సెంట్రల్ విస్టాకు కూడా అంబేద్కర్ పేరు పెట్టాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తేనే చిత్తశుద్ధి ఉందని నమ్ముతారన్న వాదన వినిపిస్తోంది. ఈ విషయంపై వైసీపీలోనూ చర్చ జరుగుతోదంి.త తీర్మానంతో పోయేదేముంది.. చేస్తే సరిపోతుందిగా అని దళిత నేతలు ఎక్కువగా అభిప్రాయపడుతున్నారు. మరి సీఎం జగన్ ఏం చేస్తారో ?