మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని పించన్లను ఇంటింటికి వెళ్లి అందచేసే ఏర్పాట్లు చేయాలని లేఖలు రాస్తున్నారు. ప్రతిపక్షాల భయం.. ప్రతిపక్షాలది. ముసలోళ్లను చచ్చిపోయేలా చేసి ఆ శవాలతో జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారానికి వెళ్తున్నారని.. వారందర్నీ ప్రతిపక్షాలే చంపాయని రాజకీయం చేస్తుంది.
శవ రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి స్థాయికి దిగజారిపోయేలా ఇతర పక్ష పార్టీల నేతలకు రాజకీయం చేయడం చేత కావడం లేదు. జగన్ రెడ్డి ప్లస్ పాయింట్ శవ రాజకీయం మారిపోయింది. ఎదురీదుతున్నారని వైసీపీ నేతలు ఓ అంచనాకు వచ్చేసిన తరుణంలో ఎన్నికలకు ముందు ఆయన కొత్త శవాల కోసం ఏదైనా చేసినా ఆశ్చర్యం లేదన్న అనుమానాలు ఉన్నాయి. పాత డ్రామాను కొత్తగా రక్తి కట్టించిన ఆయనకు.. రోడ్డు మీద దొరికిన శవంతో రాజకీయం వెన్నతో పెట్టిన విద్య.
అందుకే రాజకీయ పార్టీలు ముందు జాగ్రత్త పడుతున్నాయి. వారం రోజుల నుంచే ఈసీకి.. సీఎస్ కు లేఖలు రాయడం ప్రారంభించారు. పెన్షన్ల పంపిణీలో లోటుపాట్లు రాకుండా చూడాలని కోరుతున్నారు. ఒకటో తేదీన ఇంటికి పంపిణీ చేయాలంటున్నారు. వైసీపీ కోసం పని చేస్తున్న సీఎస్ సహా ముగ్గురు కీలక అధికారులు ఈ సారి కూడా కుట్ర పన్నే అవకాశాలు ఉన్నాయని అనుమానిస్తున్నారు. సీఎస్ ను బదిలీ చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నా స్పందన లేదు. సీఎస్ కొత్త వారొస్తే పించన్ల పంపిణీపై కుట్రలు చేయరని విపక్షాలతో పాటు ప్రజలూ నమ్ముతున్నారు.