పదకొండు మంది ఎమ్మెల్యేలే ఉన్నా తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాల్సిందేనని జగన్ స్పీకర్ కు లేఖ రాశారు. అయితే ప్రజలు ఇవ్వని దాన్ని తాము ఎలా ఇస్తామని టీడీపీ నేతలు అంటున్నారు. ప్రధాన ప్రతిపక్ష హోదా లేకపోయినా ఆయన ప్రతిపక్ష నేత అవుతారని… ఆ కోణంలో పని చేసుకోవచ్చని సలహా ఇస్తున్నారు. కానీ జగన్ మాత్రం తనకు ప్రధాన ప్రతిపక్ష హోదా కావాలంటున్నారు. ఈ క్రమంలో టీడీపీ ఆయనకు ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇచ్చేందుకు సిద్ధమని సంకేతాలు పంపుతోంది. కానీ దానికో మార్గాన్ని సూచిస్తోంది.
అసెంబ్లీలో ప్రతిపక్ష నేత హోదా సాధ్యం కాదు కానీ.. శాసనమండలిలో మెజార్టీ ఉన్నందున .. ఎమ్మెల్యేగా రాజీనామా చేసి ఎమ్మెల్సీగా మారితే అక్కడ ప్రతిపక్ష నేత హోదా వస్తుందని సలహాలిస్తున్నారు టీడీపీ నేతలు. ఆ పార్టీ సీనియర్ నేత జీవీ రెడ్డి ఈ మేరకు సోషల్ మీడియాలో సలహా ఇచ్చారు. మండలిలో వైసీపీకి మెజార్టీ ఉన్నందున… అక్కడ ప్రతిపక్ష నేత హోదా కోసం ప్రయత్నించవచ్చని సూచించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వైసీపీ నుంచి ఒక్కరు కూడా ఎమ్మెల్యేగా గెలవరు. జగన్ కూడా గెలవరు. అందుకే జీవీ రెడ్డి తామే గవర్నర్ కోటా కింద సిఫారసు చేస్తామని కూడా ఆఫర్ ఇచ్చారు.
ఇది కాస్తా తేడాగా ఉన్నప్పటికీ వైసీపీకి. ప్రతిపక్ష నేత హోదా పొందాలనుకుంటున్న జగన్ కు కాస్త బెటర్ గానే ఉంటుంది. కానీ మండలిలో ప్రతిపక్ష నేత… మండలికే పరిమితం అవుతారు. శాసనసభలోకి అడుగుపెట్టలేరు. కానీ మంత్రులు మాత్రం… రెండు సభల్లోకి వెళ్లడానికి అవకాశం ఉంటుంది. ప్రతిపక్ష నేత హోదా కోసం రుబాబుతో విజ్ఞప్తి చేస్తున్న జగన్కు ఇలాంటి సలహాలు బోలెడన్ని వస్తున్నాయి. దేన్ని ఆచరించి హోదా తెచ్చుకుంటారేమో !