ఏపీ సీఎం జగన్ బీసీ రాజకీయాలు కొత్త టర్నా్ తీసుకున్నాయి. బీసీలను తీసేసి బీసీలకు టిక్కెట్లు ఇస్తున్నట్లుగా బిల్డప్ ఇవ్వడం ఎందుకని.. పులివెందులలోనే బీసీ అభ్యర్థికి టిక్కెట్ ఇవ్వాలన్న చాలెంజ్ అన్ని వైపుల నుంచి పెరుగుతుంది. చంద్రబాబునాయుడు కూడా ఇదే సవాల్ విసిరారు. ఓడిపోయే చోట్ల ఎందుకని.. రెడ్డి వర్గం అరవై శాతం ఉన్న పులివెందులలో బీసీకి టిక్కెట్ ఇవ్వాలని సవాల్ చేశారు. దీనిపై వైసీపీ నుంచి స్పందన లేదు.
కానీ జగన్ రెడ్డి సీరయస్ గా తీసుకుంటే.. టిక్కెట్ ఇవ్వొచ్చని చెబుతున్నారు. బీసీ నినాదం విషయంలో టీడీపీకి చెక్ పెట్టేందుకు పులివెందులో బీసీకి టిక్కెట్ కేటాయిస్తే ఎసలా ఉంటుందని జగన్ ఆలోచించే అవకాశం లేకపోలేదంటున్నారు. బీసీని నిలబెట్టినా పత్తనం వైఎస్ కుటుంబం చేతుల్లోనే ఉంటుందని.. కానీ పేరు మాత్రం వస్తుందని గుర్తు చేసుకుంటున్నారు. ఇప్పటికే జగన్ పులివెందుల నియోజకవర్గం మారాలని అనుకుంటున్నారు. జమ్మలమడుగు నుంచి పోటీ చేసే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది.
ఆ నియోజకవర్గానికి మారడానికి కూడా ఇంత కంటే మంచి అవకాశం రాదని అంచనా వేస్తున్నారు. టీడీపీ వైపు నుంచి పులివెందులను బీసీలకు కేటాయించాలన్న డిమాండ్ మరింత పెరిగితే… ఆ మేరకు జగన్ నిర్ణయాన్ని పరిశీలించవచ్చని వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి.