హరీష్ సాల్వే చేసుకున్న మూడో పెళ్లికి హాజరయ్యేందుకు సీఎం జగన్ లండన్ వరకూ వెళ్లారని కానీ ఏపీలోనే ఉన్న విశాఖ ఎన్ఐఏ కోర్టుకు ఎందుకు హాజరు కావడం లేదని సీఎం జగన్ ను.. కోడికత్తి కేసు నిందితుడు శీను తరపుల లాయర్ సలీం ప్రశ్నించారు. కోడికత్తి కేసు విచారణ విశాఖ ఎన్ఐఏ కోర్టులో జరిగింది. ఈ సందర్భంగా సీఎం జగన్ ముఖ్యమైన పదవిలో ఉన్నందున అడ్వకేట్ కమిషన్ ను నియమించుకునేందుకు అవకాశం కల్పించాలని జగన్ తరపులాయర్లు కోరారు. వాదనల తర్వాత కేసును ఇరవయ్యో తేదీకి వాయిదా వేశారు.
కోర్టు బయట నిందితుడి తరపు న్యాయవాది సలీం సంచలన వ్యాఖ్యలు చేశారు. హరీష్ సాల్వే మూడో పెళ్లి కోసం జగన్ లండన్ వెళ్లారని.. దళిత బిడ్డ ను జైల్లో మగ్గిపోయేలా చేస్తున్నారని విమర్శించారు. జగన్పై దాడి జరిగిన రోజు కోడి కత్తితో చేసినట్లు ఏ సాక్షి లేరని నిందితుడి తరపు లాయర్ చెబుతున్నారు. సాక్షులుగా ఉన్నవాళ్లు కూడా కత్తితో దాడిచేసినట్లు చూడలేదని చెబుతున్నారన్నారు. ఈ కేసులలో మజ్జి శ్రీనే కీలకంగా ఉన్నారని సలీం చెబుతున్నారు. మజ్జి శ్రీను తన ఫోన్ విచారణ అధికారులకు ఎందుకు డిపాజిట్ చేయలేదని లాయర్ సలీం ప్రశ్నించారు.మావద్ద అన్ని ఆధారాలున్నాయని.. సమయం వచ్చినప్పుడు అందిస్తామన్నారు.
ఒక ఎస్సీ బిడ్డను నాలుగున్నరేళ్లుగా మగ్గిపోయేలా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జనుపల్లి శ్రీనివాస్ పుడ్ కోర్టులో అనుమతితోనే పనిచేస్తున్నారని. ఐదుగురు వైసీపీ నేతలు పాస్ లేకుండానే ప్రవేశించిన విషయం కోర్టు ముందుంచుతున్నామని ప్రకటించారు. ఆ రోజు పోలీస్ స్ట్రెకింగ్ ఫోర్స్ జీపుపై వైసీపీ నేతలు దాడి చేశారని దాడిచేసిన వారిపై చర్యలు ఎందుకు తీసుకోలేదని నిందితులు శ్రీను తరపు న్యాయవాది సలీం ప్రశ్నించారు. కోడికత్తి శీను లాయర్ వేస్తున్న ప్రశ్నలకు.. జగన్ రెడ్డి లాయర్ల వద్ద సమాధానాలు ఉండటం లేదు.