ఎన్నార్సీకి వ్యతిరేకం అని ప్రకటించిన జగన్మోహన్ రెడ్డి.. ముస్లింల ఎదుట తన నిజాయితీని ప్రత్యక్షంగా నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఎన్నార్సీ ఆలోచన లేదని.. యూటర్న్ తీసుకున్న ప్రభుత్వం .. కొత్తగా ఎన్పీఆర్.. అంటే జాతీయ జనాభా జాబితాను అప్ డేట్ చేయాలని నిర్ణయించింది. దీన్ని కూడా.. అమలు చేయకూడదనే డిమాండ్లు… ముస్లిం వర్గాల నుంచి భారీగా వస్తున్నాయి. జగన్ ఆత్మీయుడు.. అసదుద్దీన్ ఓవైసీ ఈ అంశంపై… బీజేపీయేతర రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం అవుతున్నారు. ఆయన తెలంగాణ సీఎం కేసీఆర్ ను ముస్లిం సంఘాల ప్రతినిధులుతో కలిసి ఎన్పీఆర్ను అమలు చేయవద్దని కోరారు. కేసీఆర్ ఏ నిర్ణయం ప్రకటించకపోయినప్పటికీ.. ఎన్నార్సీకి.. పౌరసత్వ చట్ట సవరణ బిల్లుకు.. పార్లమెంట్లో వ్యతిరేకించారు. దాంతో.. ఆయనపై ఓవైసీకీ భరోసా ఉంది.
ఇప్పుడు ఎన్పీఆర్ విషయంలోనూ.. ముస్లింలు భయాందోళనలకు గురవుతున్నారు. అందుకే.. ఏపీలోనూ అమలు చేయవద్దని ఓవైసీ.. జగన్ ను కోరడం ఖాయంగా కనిపిస్తోంది. ఓవైసీ కోరకపోయినా.. ఎన్పీఆర్ ఏపీలో.. అమలు చేస్తే.. ముస్లింలు ఆగ్రహం వ్యక్తం చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం.. ఎలాంటి సమాచారం సేకరించినా… అది తమకు వ్యతిరేకంగానే అని.. ముస్లింలు నమ్ముతున్నారు. ఎన్నార్సీకి వ్యతిరేకమన్న జగన్.. ఎన్పీఆర్ విషయంలో ఇంకా విధానాన్ని ప్రకటించలేదు. ఎప్రిల్ నుంచి.. ఈ ఎన్పీఆర్ అన్ని రాష్ట్రాల్లో అమలు చేయాల్సి ఉంది. అమలు చేయకపోతే.. కేంద్రం ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది.
అమలు చేస్తే.. ముస్లిం ఓటు బ్యాంక్ దూరమవుతుంది. అందుకే.. జగన్మోహన్ రెడ్డి సర్కార్ ప్రభుత్వం ఈ విషయంలో ఒత్తిడిలో పడినట్లుగా తెలుస్తోంది. ఎన్పీఆర్ అమలు చేయకపోవడం..రాజ్యాంగ విరుద్ధమయ్యే సూచనలు కూడా ఉన్నాయి. ఎందుకంటే.. ఇది జాతీయ పౌర జాబితా మరి.