ఏపీలో తనను తాను కాపాడుకోవటానికి జగన్ ఇండియా కూటమిలో చేరబోతున్నారా…? గతంలో ఉన్న విభేదాలతో మధ్యవర్తుల సహకారంతో కూటమిలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారా…? అంటే ఢిల్లీలో ఉన్న పరిస్థితులు బలం చేకూర్చేలా ఉన్నాయి.
రాష్ట్రంలో, కేంద్రంలో ఎన్డీయే పక్షాల ప్రభుత్వాలున్నాయి. రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ఎన్డీయే కూటమికి వ్యతిరేకంగా మాజీ సీఎం జగన్ ఢిల్లీలో ధర్నా చేపట్టారు. దేశంలో ఉన్న చాలా పార్టీలకు సమాచారం ఇచ్చి, మద్ధతివ్వాలని వైసీపీ కోరినా ఎవరూ పట్టించుకున్నట్లు కనపడలేదు.
కానీ, అనూహ్యంగా ఇండియా కూటమిలో ఉన్న కీలకమైన సమాజ్ వాదీ పార్టీ జగన్ ధర్నాకు సంఘీభావం ప్రకటించింది. మోడీ, బీజేపీ, ఎన్డీయే కూటమితో దూరంగా ఉండే అఖిలేష్ యాదవ్… జగన్ కు మద్ధతుగా నిలవటం అంటే ఇండియా కూటమివైపు జగన్ మొగ్గుచూపుతున్నందునే అన్న ప్రచారం జరుగుతోంది.
Also Read : జగన్ రాజకీయ అజ్ఞాని..షర్మిల అలా తేల్చేస్తున్నారా?
రాజ్యసభలో ఎన్డీయేకు పూర్తిబలం లేకపోవటంతో జగన్ కూడా బయట నుండి ఎన్డీయేకు మద్ధతిస్తారని ప్రచారం జరిగినా, లోక్ సభలో ఎన్డీయే కూటమి ప్రభుత్వంలో కింగ్ మేకర్ గా ఉన్న తెలుగుదేశంను కాదని జగన్ ను దగ్గరకు తీసే పరిస్థితులు లేకపోవటంతో బీజేపీ పెద్దలెవరూ జగన్ కు అండగా ఉండే పరిస్థితులు కనపడకపోవటంతో… జగన్ కూటమివైపు చూస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది.
గతంలో కాంగ్రెస్ తో ఉన్న విభేదాల కారణంగా… మధ్యవర్తిగా అఖిలేష్ యాదవ్ వచ్చి ఉంటారని, కానీ ఏపీలో కాంగ్రెస్ తుడిచిపెట్టుకపోయేందుకు కారణమైన జగన్ ను సోనియా, రాహుల్ దగ్గరకు రానిస్తారన్న నమ్మకాలు లేవంటున్నారు విశ్లేషకులు.