కాంగ్రెస్ సారథ్యంలోని ఇండియా కూటమి వైపు వైసీపీ అధినేత జగన్ అడుగులు వేస్తున్నారన్న ప్రచారం కొద్ది రోజులుగా గుప్పుమంటోంది. ఇందులో నిజమెంత ఉందో కాని ఈ విషయాన్ని అటు జగన్ కానీ, ఇటు కాంగ్రెస్ కానీ ఖండించడం లేదు. దీంతో ఈ ప్రచారానికి ప్రాధాన్యత ఏర్పడింది. అయితే , ఈ విషయంలో మరి కొద్ది గంటల్లో ఓ స్పష్టత వచ్చే అవకాశమైతే కనిపిస్తోంది.
కేంద్ర బడ్జెట్ పై ఇండియా కూటమి తీవ్ర విమర్శలు చేస్తోంది. ఇండియా కూటమి పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం చేశారని ఆరోపణలు చేస్తోంది. లోక్ సభలో రాహుల్, టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా, డీఎంకే ఎంపీలు ఎన్డీయేపై విరుచుకుపడుతున్నారు. రాజ్యసభలోనూ ఇదే సీన్ కనిపిస్తోంది. ఈ విషయంలో మోడీపై మరింత ఒత్తిడి పెంచేందుకు ఇండియా కూటమి నేతలు బుధవారం పదకొండు గంటలకు పార్లమెంట్ సెంట్రల్ హల్ లో సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించబోతున్నారు.
Also Read : షర్మిల నిలదీస్తున్నా జగన్ మౌనం ఎందుకు..?
ఈ సమావేశానికి కలిసి వచ్చే పార్టీలను సైతం కలుపుకొని వెళ్ళాలని భావిస్తున్నారు. ఒకవేళ ఈ సమావేశానికి హాజరు కావాలని వైసీపీని ఆహ్వానిస్తే..ఆ పార్టీ వెళ్తుందా..? అనే సందేహాలు ఉన్నప్పటికీ వైసీపీ ఇండియా కూటమి సమావేశంలో పాల్గొంటే ఇక ఆ పార్టీ దాదాపు ఇండియా కూటమికి చేరువ అయినట్లే. అదే జరిగితే పరిణామాలు తీవ్రంగా ఉండటంతోపాటు ఏపీ రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకునే అవకాశం లేకపోలేదు. చూడాలి ఏం జరుగుతుందో..