వైసీపీ అధినేత జగన్ రెడ్డి ఇప్పుడు అవినాష్ రెడ్డిని కూడా దూరం పెట్టాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. లేకపోతే ప్రజల్లో ఆయన తల్లి, చెల్లిని కూడా సోషల్ సైకోలతో తిట్టించిన వ్యక్తిగా స్థిరపడిపోతారు. పులివెందులకు చెందిన నర్రా రవీంద్రారెడ్డిపై పెట్టిన కేసులు కేవలం టీడీపీ నేతల్ని, వారి కుటుంబాల్ని తిట్టారని కాదు.. ముఖ్యంగా విజయమ్మ, షర్మిల,సునీతలను తిట్టారని.సునీత కూడా రేపోమాపో ఫిర్యాదు చేయబోతున్నారు. గతంలో చేసిన ఫిర్యాదులు కూడా ఉన్నాయి.
ఈ వర్రా రవీంద్రారెడ్డి అనే వ్యక్తి తన సొంతంగా ఆ పోస్టులు పెట్ట లేదు. ఎందుకంటే జగన్ రెడ్డి కుటుంబం మీద. పోస్టులు పెట్టేంత ధైర్యం ఆయనకు లేదు. ఆయన అవినాష్ రెడ్డి ఆదేశాలతోనే పోస్టులు పెట్టారని తాజాగా పోలీసులు వెల్లడించారు. అవినాష్ రెడ్డి పీఏ రాఘవరెడ్డి ద్వారా వర్రాకు కంటెంట్ పంపుతారు. ఆయన పోస్టు చేస్తారు. ఇప్పుడీ రాఘవరెడ్డి కోసం పోలీసులు వెదుకుతున్నారు. ఆయనను అవినాష్ రెడ్డి దాచి పెట్టారు. ఇవాళ కాకపోతే రేపు పట్టుకుంటారు. మొత్తం అవినాష్ రెడ్డి వ్యవహారాన్ని ఎక్స్ పోజ్ చేస్తారు.
అంటే జగన్ రెడ్డి తల్లి, చెల్లిని తిట్టించింది అవినాష్ రెడ్డి అని క్లారిటీ వస్తుంది.. మరి అలాంటి వ్యక్తిని జగన్ దగ్గరకు తీసుకుని ఇంకా సమర్థిస్తారా అన్న ప్రశ్న వస్తుంది. సమర్థిస్తే తన సొంత తల్లిని, చెల్లిని సోషల్ మీడియాలో ఇంత ఘోరంగా తిట్టించింది జగనేనా అని ప్రజలు ఛీత్కరించుకోవడం ప్రారంభిస్తారు. ఒకవేళ ఆదరించకపోతే అవినాష్ రెడ్డి కుటుంబాన్ని కూడా దూరం పెట్టాలి. తన తల్లి, చెల్లిపై తప్పుడు పోస్టులు పెట్టిన వారిని శిక్షించాలని ఆయన కూడా డిమాండ్ చేయాలి. ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లోనూ జగన్ లేరు. ఏదీ తేల్చుకోలేకపోతున్నారు.
వర్రాను బయటకు తీసుకురావడానికి.. సజ్జల భార్గవరెడ్డి, అర్జున్ రెడ్డి అనే వారిని కాపాడటానికి జగన్ ప్రయత్నాలు చేస్తే.. మొత్తంగా.. ఆయనకే ఇబ్బంది.అంటే ఇప్పుడు అవినాష్ రెడ్డినీ జగన్ వదులుకోవాలి. వదులుకోకపోతే.. ప్రజల్లో ఆయన ఇమేజ్ ఇంకా ఘోరంగా పడిపోతుంది.