మన్మథుడు సినిమాలో ధర్మవరపు సుబ్రహ్మణ్యం దొరికిపోయినట్లుగా ఆర్జీవీ, పోసాని దొరికిపోయారు. వారిని కాపాడేందుకు జగన్ రెడ్డి కనీస ప్రయత్నం చేయడం లేదు. వారికి డబ్బులు ఇచ్చాం కాబట్టి సేవలు చేశారు.. తర్వాత ఏం జరిగినా వారిదే బాధ్యత అన్నట్లుగా ఉన్నారు. న్యాయసాయం చేస్తామని ధైర్యంగా ఉండాలని వారికి భరోసా పంపుతున్న సూచనలు కూడా కనిపించడం లేదు. దాంతో వారిద్దరూ ఏం చేయాలా అని తంటాలు పడుతున్నారు.
ఇటీవల ఓ ప్రెస్ మీట్లో మాట్లాడిన జగన్ ఆర్జీవీని తీసిన సినిమాలన్నింటికీ సెన్సార్ సర్టిఫికెట్లు ఉన్నాయని సమర్థించారు. సినిమాలు తీసినందుకు ఆర్జీవీపై కేసు పెట్టలేదు. ఎందుకు పెట్టారో జగన్కు తెలుసు. అయినా ఆయన గురించి ప్రస్తావించారు. తాము సపోర్టుగా ఉంటామని చెప్పలేదు. అదే సమయంలో పోసాని గురించి అసలు మాట్లాడలేదు. ఆయనెవరో తమ పార్టీకి తెలీదన్నట్లుగా మీడియా ప్రతినిధులు ప్రశ్నించినా స్పందించలేదు.
మామూలుగా అయితే వారిపై పదే పదే నమోదైన కేసులకు సంబంధించి కనీసం పొన్నవోలు సుధాకర్ రెడ్డిని అయిన తమ తరపున వాదించేందుకు ఏర్పాట్లు చేస్తారని అనుకున్నారు. కానీ వైసీపీ నుంచి న్యాయ సాయం కూడా అందే సూచనలు కనిపించడం లేదు. పోలీసులు అరెస్టు చేసి కొడితే ఎవరికి చెప్పుకోవాలో తెలియక.. పోసాని రాజకీయ రిటైర్మెంట్ అన్నారు. ఆర్జీవీ తనకు తెలిసిన వారి ద్వారా బతిమాలుకునే ప్రయత్నం చేస్తున్నారు. జగన్ రెడ్డిని నమ్ముకుని వీరికి ఈ పరిస్థితి వచ్చిందని.. ఎవరూ కాపాడలేరన్న సెటైర్లు మాత్రం వినిపిస్తున్నాయి.