వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు చిత్రంగా ఉంటాయి. ఫృధ్వీ వ్యాఖ్యలపై జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారని.. ఆయనపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారంటూ.. మీడియాకు ఓ సందేశం.. అందింది. ఇంతకీ .. జగన్మోహన్ రెడ్డి… ఫృధ్వీ చేసిన ఏ వ్యాఖ్యలపై చర్య తీసుకుంటారో మాత్రం అందులో క్లారిటీ లేదు. రైతుల్ని నానా మాటలన్న.. వ్యాఖ్యలపైనా చర్యలు తీసుకుంటారా.. లేక మహిళా ఉద్యోగినులతో చేసిన రాసలీలల వ్యవహారంపై చర్య తీసుకుంటారో మాత్రం క్లారిటీ లేదు. ఎందుకంటే.. రైతులను ఫృధ్వీ కించ పరిచి చాలా కాలం అయింది. దాదాపుగా పది రోజులు అయింది. దానికి ఎలా కౌంటర్ ఇవ్వాలో.. పోసాని వైపు నుంచి వైసీపీ పెద్దలు ఓ ప్లాన్ అమలు చేశారు కూడా. కానీ అది వర్కవుట్ అవలేదు. దాంతో.. జగన్ .. సీరియస్ అయినట్లుగా… మందలించినట్లుగా.. ఓ కబురును మీడియాకు పంపారు.
వైసీపీ రాత అంత బాగోలేదేమో కానీ.. ఇది బయటకు వచ్చే సరికి.. ఫృధ్వీ లైంగిక వేధింపులతో ఫేమస్ అయిపోయారు. అదే సమయంలో.. కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి .. మరింత ఫేమస్ అయిపోయారు. దారుణమైన తిట్లను.. బహిరంగంగా.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌పై ప్రయోగించి.. తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. అలాంటి వారిని వైసీపీలో ఎలా కొనసాగనిస్తారని.. తక్షణం ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసి..మరో నేత అలా మాట్లాడకుండా చేయాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. నిజానికి అలా మాట్లాడటం.. వైసీపీ బ్రాండ్ లాంటిది.
చర్యలు తీసుకోవడం అనేది ఉంది. పైగా.. ఆయనకు మరింత ప్రోత్సాహం లభించే అవకాశం కూడా ఉందని వైసీపీ వర్గాలు చెబుతూంటాయి. వ్యతిరేకించేవారిని అత్యంత దారుణంగా కించ పరిచే నైజం.. వైసీపీదని.. ఇలాంటి వారిని ప్రోత్సహిస్తారు కానీ.. చర్యలు తీసుకోరని.. అంటున్నారు. మీడియాకు మాత్రం.. సీఎం సీరియస్ అని.. చర్యలు తీసుకుంటారనే కబుర్లు మాత్రం వినిపిస్తారన్న విమర్శలు వస్తున్నాయి.