తన కుటుంబంపై టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నా మంత్రులు నోరు తెరవడం లేదని ఇలాగైతే పదవులు తీసేస్తాని కేబినెట్ మీటింగ్‌లోనే జగన్ హెచ్చరికలు జారీ చేయడంతో మంత్రులు గొంతు సవరించుకుంటున్నారు. జగన్‌కు నచ్చేలా తిట్లతో విరుచుకుపడేందుకు ఒకరి తరవాత ఒకరు తెరపైకి వస్తున్నారు. ముఖ్యంగా పదవి ప్రమాదంలో పడిందని అనుకున్న మంత్రులు .. రేసు ప్రారంభించేశారు. నాలుక కోస్తాం.. లాంటి మాటలతో మీడియా ముందుకు వచ్చి హడావుడి చేస్తున్నారు.
నిజానికి చంద్రబాబును తిట్టడం.. ఆయన ఇంటిపైకి దాడికి వెళ్లడం ప్లస్ పాయింట్లుగా జోగి రమేష్‌కు మంత్రి పదవి లభించింది. విచిత్రంగా మంత్రి అయిన తర్వాత ఆయన వాయిస్‌లో తేడా వచ్చింది. మొదట్లో జగన్‌ను మెచ్చేలా చంద్రబాబు ఆయన కుటుంబంపై ” విమర్శలు” చేసినా అవి రాను రాను తగ్గిపోయాయి. ఆయన విమర్శిస్తున్నారు కానీ.. గతంలో సెట్ చేసిన రేంజ్‌ను అందుకోకపోవడంతో పెద్దగా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇతర మంత్రులదీ అదే పరిస్థితి. కాకాణి గోవర్ధన్ రెడ్డి కూడా ఎందుకైనా మంచిదని తాను కూడా జగన్ కోరిన విమర్శల కౌంటర్లో హాజరు వేయించుకున్నారు.
ముందు ముందు మంత్రులందరూ చంద్రబాబును.. ఆయన కుటుంబాన్ని తిట్టడానికి క్యూ కట్టవచ్చు. అదే కౌంటర్ అని . .. వైసీపీ నేతలు అనుకోవచ్చు కానీ ముగ్గురు మంత్రి పదవులు మాత్రం ఖాయంగా అవుట్ అని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. అసలు ముగ్గుల్ని తొలగించే లక్ష్యంతోనే జగన్ ముందస్తు ప్లాన్ ప్రకారం ఇలా… స్పందించడం లేదనే వ్యాఖ్యలు చేశారన్న అనుమానం కూడా వైసీపీలో ఉంది.