భారతీయ జనతా పార్టీ తమకూ మిత్రపక్షాల బలం ఉందని నిరూపించేందుకు … విపక్షాల కూటమితో పాటు తాము కూడా సమావేశం నిర్వహిస్తోంది. దానికి పద్దెనిమిదో తేదీన ముహుర్తం ఖరారు చేసింది. అయితే ఏపీకి సంబంధిచినంత వరకూ ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న పార్టీ జనసేన. ఆ పార్టీకి ఆహ్వానం పంపారా లేదా అన్నదానిపై స్పష్టత లేకుండా పోయింది. తెలుగుదేశం పార్టీని పిలిచారని ఓ వైపు గగ్గోలు రేగుతోంది కానీ జనసేనకు ఆహ్వానం వచ్చిందా లేదా అన్నది మాత్రం ఎవరూ చెప్పడం లేదు. బీజేపీ నేతలు కూడా స్పందించడం లేదు.
ప్రస్తుతం ఎన్డీఏ కూటమిలో పెద్ద బలమైన రాజకీయ పార్టీలు లేవు. ఉన్న పార్టీలన్నీ చిన్నా చితకా పార్టీలు ఒకరిద్దరు ఎంపీలు ఉంటే గొప్ప అన్నట్లుగా ఉండే పార్టీలు ఉన్నాయి. అలాంటి వాటికి కూడా ప్రాధాన్యం ఇచ్చి పిలుస్తున్నారు.. ఎన్డీఏలో భాగస్వామిగా గుర్తిస్తున్నారు కానీ. … జనసేనను మాత్రం బీజేపీ అగ్రనాయకులు పెద్దగా పట్టించుకోకపోవడం చర్చనీయాంశంగా మారుతోంది. గతంలో ఎప్పుడూ బీజేపీ మిత్రపక్షంగా జనసేనను పరిగణనలోకి తీసుకోలేదు. ఇప్పుడూ అంతే వ్యవహరిస్తున్నారు.
రాష్ట్ర నాయకత్వం తీరుపైనే పవన్ కల్యాణ్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తున్నారు. బీజేపీ జాతీయ నాయకత్వంపై ప్రశంసలు కురిపిస్తూనే ఉంటారు. బీజేపీ అగ్రనాయకత్వం అయినా పవన్ కు ప్రాధాన్యం ఇచ్చి ఉంటే రెండు పార్టీల మధ్య బంధం మరింత బలపడేదని. .. కానీ ఎంత సేపూ పవన్ క్రేజ్ ను క్యాష్ చేసుకుందామని తప్ప… మిత్ర ధర్మం పాటించాలని అనుకోలేదని.. అందుకే ఇలాంటి పరిస్థితి వచ్చిందన్న విమర్శలను బీజేపీ ఎదుర్కోవాల్సి వస్తోంది.